పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా నటించిన భారీ అంచనాల చిత్రం ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veeramallu) జులై 24 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, విడుదలైన మొదటి రోజే ఈ చిత్రానికి నెగెటివ్ టాక్ వచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ సినిమాలోని సీజీ (CG) (కంప్యూటర్ గ్రాఫిక్స్) వర్క్‌పై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. చిన్న సినిమాలకు సైతం అద్భుతమైన వీఎఫ్‌ఎక్స్ (VFX) వాడుతున్న తరుణంలో, ఒక పెద్ద స్టార్ హీరో సినిమాకు ఇంత పేళవమైన సీజీ వర్క్ చేయడం ఏంటని నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు.
పవన్ ఫ్యాన్స్(Fans) సైతం సినిమా పట్ల నిరాశ వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇంకొంత మంది మాత్రం ఈ సినిమా ఓటీటీ వివరాలపై ఆరా తీస్తున్నారు. ఈ సినిమా ఏ ఓటీటీ(OTT)లో స్ట్రీమింగ్ కాబోతుంది అనేది గూగుల్‌లో సెర్చ్ చేసి మరీ వెతుకుతున్నారు.
ఓటీటీ విడుదలపై అంచనాలు
‘హరి హర వీరమల్లు’ సినిమా విడుదలకు ముందే ఓటీటీ రైట్స్ అమ్ముడుపోయాయి. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ (Amazon Prime) మంచి ధరకు డిజిటల్ రైట్స్ పొందింది. వాస్తవానికి, సినిమా విడుదలైన 8 వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాలని భావించారట. ఈ లెక్కన సెప్టెంబర్ రెండో వారంలో ఈ మూవీ ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉంది.
అయితే, ఈ సినిమాకు అనూహ్యంగా నెగెటివ్ టాక్ రావడంతో, ఓటీటీలో అనుకున్నదాని కంటే ముందే స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉందని సినీ పండితులు చెబుతున్నారు. సినిమా హిట్ అయితే ఎనిమిది వారాల వరకు ఆగేవారు కానీ, ఇప్పుడున్న టాక్‌ని బట్టి చూస్తే నెల రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉందని టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తుంది. ఈ లెక్కన ఆగస్ట్ చివరి నాటికే ఈ సినిమా డిజిటల్ తెరపై వచ్చే అవకాశం ఉంది.