బీసీసీఐ అధ్యక్ష పదవికి హర్భజన్ సింగ్?

బీసీసీఐ అధ్యక్ష పదవికి హర్భజన్ సింగ్?

భారత క్రికెట్ (India Cricket) నియంత్రణ మండలి (బీసీసీఐ)(BCCI) అధ్యక్షుడు రోజర్ బిన్నీ (Roger Binny) పదవీకాలం త్వరలో ముగియనుంది. దీంతో కొత్త అధ్యక్షుడి ఎంపికపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఈ స్థానం కోసం పలువురి పేర్లు వినిపిస్తున్నప్పటికీ, టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ (Harbhajan Singh) పేరు ప్రముఖంగా తెరపైకి వచ్చింది. ఈ ప్రచారానికి పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ (పీసీఏ)(PCA) తీసుకున్న ఒక నిర్ణయం మరింత బలాన్ని చేకూర్చింది.

పీసీఏ, హర్భజన్ సింగ్‌ను తమ ప్రతినిధిగా బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశానికి (AGM) నామినేట్ చేసింది. దీంతో హర్భజన్ ఈ సమావేశంలో పాల్గొని అధ్యక్ష పదవికి పోటీ చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ నెల 28న బీసీసీఐ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలోనే కొత్త అధ్యక్షుడి పేరు ఖరారు అయ్యే అవకాశం ఉంది. గతంలో సౌరవ్ గంగూలీ, రోజర్ బిన్నీ వంటి మాజీ క్రికెటర్లు ఈ పదవిలో కొనసాగారు. హర్భజన్ సింగ్ 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్‌ గెలిచిన భారత జట్టులో సభ్యుడు. ఈ పదవి ఆయనకు లభిస్తే మరో ప్రపంచకప్ విజేతకు అరుదైన గౌరవం దక్కినట్లు అవుతుంది.

Join WhatsApp

Join Now

Leave a Comment