క్రికెట‌ర్ విహారికి ‘ఏసీఏ’ తీర‌ని అన్యాయం.. వైసీపీ కౌంట‌ర్‌

క్రికెట‌ర్ విహారికి 'ఏసీఏ' తీర‌ని అన్యాయం.. వైసీపీ కౌంట‌ర్‌

అంతర్జాతీయ క్రికెటర్‌ హనుమ విహారి (Hanuma Vihari) మరోసారి సంచలనం సృష్టించారు. ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌(ఏసీఏ)(ACA)పై తీవ్రమైన ఆరోపణలు చేస్తూ, తనకు అవకాశాలు ఇవ్వకుండా అన్యాయం జరుగుతోందని మండిపడ్డారు. దీంతో ఏసీఏని వదిలేసి, త్రిపుర (Tripura) రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించాలని కీలక నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు. మూడు ఫార్మాట్లలోనూ సత్తా చూపగల సామర్థ్యం ఉన్నా, ఏసీఏ తనను పట్టించుకోవడం లేదని టీమిండియా జ‌ట్టు క్రికెట‌ర్‌ ఆవేదన వ్యక్తం చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది.

ఇండియా జట్టు (India Team)లోనూ ప్రతిభ కనబర్చిన సీనియర్‌ ప్లేయర్‌గా ఉన్నా కూడా త‌న‌కు ఆంధ్ర క్రికెట్ అసోసియేష‌న్‌ ప్రాధాన్యత ఇవ్వకపోవడమే ఈ నిర్ణయానికి కారణమని విహారి స్పష్టం చేశారు. క్రికెట్‌లో రాజకీయ జోక్యం పెరిగిపోయిందని, క్రీడాకారుల భవిష్యత్తు కంటే రాజకీయ ప్రయోజనాలను ముందుకు పెడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. త‌న‌కు అన్యాయం చేస్తున్న అసోసియేష‌న్‌ను వీడి కొత్త వాతావరణంలో తన ఆటతీరును కొనసాగించాలని కోరుకుంటున్న‌ట్లుగా విహారి తెలిపారు.

వైసీపీ సంచ‌ల‌న ట్వీట్‌..
ఇక రాజకీయ కోణంలో కూడా విహారి వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. గతంలో ఇదే హనుమ విహారి విషయంలో వైఎస్‌ జగన్‌ (YS Jagan) ప్రభుత్వం (Government)పై విపరీతంగా ఆరోపణలు చేసి, నిందలు వేసిన తెలుగుదేశం పార్టీ(Telugu Desam Party) నేత‌లు.. ఇప్పుడేం స‌మాధానం చెబుతార‌ని ప్ర‌తిప‌క్ష వైసీపీ ప్ర‌శ్నిస్తూ ట్వీట్ చేసింది. ఆంధ్రక్రికెట్‌ అసోసియేషన్ అంతా టీడీపీ(TDP) వాళ్ల గుప్పిట్లో ఉందని, మరి ఎవరు తప్పుచేశారని హనుమ విహారి విసుగు చెందాడు? అని నిల‌దీసింది. ఎవరు అతనికి అవకాశాలను ఇవ్వడంలేదు?.. తనకు సత్తా ఉన్న ఇక్కడ అవకాశాలు దక్కట్లేదు అన్న విహారి ఆరోపణలకు సమాధానం ఏంటి?.. దీనికి బాధ్యుడు ఏసీఏ అధ్యక్షుడు టీడీపీ ఎంపీ(TDP MP) కేశినేని చిన్నా (Kesineni Chinna), లేక కార్యదర్శి, మరొక టీడీపీ ఎంపీ సానా సతీషా? అని స‌మాధానం చెప్పాల‌ని డిమాండ్ చేసింది.

Join WhatsApp

Join Now

Leave a Comment