నార్వే చెస్ 2025లో గుకేష్ చరిత్రాత్మక విజయం..

నార్వే చెస్ 2025లో గుకేష్ చరిత్రాత్మక విజయం..

భారత చెస్ సంచలనం (Indian Chess Sensation), ప్రపంచ చాంపియన్ (World Champion) డి. గుకేష్ (D. Gukesh) నార్వే చెస్ (Norway Chess) 2025 టోర్నమెంట్‌లో చరిత్ర సృష్టించాడు. రౌండ్ 6లో ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు మాగ్నస్ కార్ల్‌సన్‌పై తన తొలి క్లాసికల్ విజయాన్ని (First Classical Win) సాధించాడు. ఈ విజయం గుకేష్‌కు కీలకమైన మైలురాయిగా నిలిచింది. ఇది భారత చెస్‌కు గర్వకారణమైన క్షణం. 19 ఏళ్ల ఈ యువ చాంపియన్, గత డిసెంబర్‌లో సింగపూర్‌ (Singapore)లో డింగ్ లిరెన్‌ను ఓడించి ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా నిలిచిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. నార్వే చెస్ టోర్నీలో మాగ్న‌స్ కార్ల్‌స‌న్‌ (Magnus Carlsen)పై కీల‌క విజ‌యాన్ని న‌మోదు చేసి రికార్డ్ సృష్టించాడు.

రౌండ్ 6లో గుకేష్ ఆధిపత్యం
నార్వే చెస్ 2025 రౌండ్ 6లో గుకేష్, కార్ల్‌సన్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో రూయ్ లోపెజ్ ఓపెనింగ్‌తో ఆటను ప్రారంభించాడు. మిడిల్ గేమ్‌లో కార్ల్‌సన్ ఆధిక్యంలో ఉన్నప్పటికీ, గుకేష్ తన నైపుణ్యాలతో ఆటను కొన‌సాగిస్తున్నాడు. ఇంత‌లో కార్ల్‌సన్ ఎండ్‌గేమ్‌లో నైట్‌ను తప్పుగా కదిలించడంతో గుకేష్‌కు అవకాశం లభించింది. సమయ ఒత్తిడిలో కార్ల్‌సన్ చేసిన ఈ బ్లండర్‌ను గుకేష్ సమర్థవంతంగా వినియోగించుకుని, కీల‌క‌మైన మూవ్స్‌తో విజయాన్ని అందుకున్నాడు. ఈ గెలుపు తర్వాత గుకేష్ మాట్లాడుతూ.. మాగ్నస్‌పై తొలి క్లాసికల్ విజయం సాధించడం గొప్పగా ఉంది అని సవినయంగా వివ‌రించాడు.

కార్ల్‌సన్ ఆవేశం, గుకేష్ స్పందన
మ్యాచ్ ముగిసిన తర్వాత, కార్ల్‌సన్ నిరాశతో బల్ల విరగ్గొట్టి, కొన్ని చెస్ పీస్‌లను క్రింద పడేశాడు, ఈ దృశ్యం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై గుకేష్ స్పందిస్తూ, “మాగ్నస్ రియాక్షన్‌ను నేను అర్థం చేసుకోగలను, ఎందుకంటే నేను కూడా గతంలో చాలా సార్లు టేబుల్స్‌ను కొట్టాను” అని స్పోర్ట్స్‌మన్‌షిప్‌తో చెప్పాడు. గుకేష్ కోచ్ గ్రెగోర్జ్ గజేవ్స్కీ మాట్లాడుతూ, “గుకేష్‌ను అదృష్టం వ‌రించినా, అతని స్థిరత్వం, రిసోర్స్‌ఫుల్‌నెస్‌కు క్రెడిట్ ఇవ్వాలి. అతను చాలా సేపు ఓటమి ఖాయమని తెలిసినా, పట్టుదలతో ఆడాడు” అని ప్రశంసించాడు.

నార్వే చెస్ 2025: ఇతర ఫలితాలు
రౌండ్ 6లో ఇతర మ్యాచ్‌లలో, భారత గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఎరిగైసి చైనా ఆటగాడు వీ యీతో క్లాసికల్ గేమ్‌లో డ్రా సాధించి, ఆర్మగెడాన్‌లో విజయం సాధించాడు, 7.5 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచాడు. ఫాబియానో కారువానా హికారు నకమురాపై ఆర్మగెడాన్‌లో గెలిచి, కార్ల్‌సన్‌తో సంయుక్త ఆధిక్యంలో నిలిచాడు. మహిళల విభాగంలో, ఆర్. వైశాలి కొనేరు హంపీని ఓడించగా, అన్నా ముజిచుక్ ఆర్మగెడాన్‌లో సారా ఖాదెమ్‌పై గెలిచి టోర్నమెంట్ ఆధిక్యాన్ని కొనసాగించింది.

భారత చెస్‌కు గర్వకారణం
ఈ విజయం భారత చెస్ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది. ఎక్స్ వేదిక‌గా ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ (Prime Minister Narendra Modi), ఏపీ సీఎం చంద్ర‌బాబు (Chandrababu), మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి (Y. S. Jagan Mohan Reddy) గుకేష్‌కు అభినంద‌న‌లు తెలిపారు. “గుకేష్ మాగ్నస్ కార్ల్‌సన్‌ను ఓడించడం భారత చెస్‌కు గొప్ప క్షణం. అతని నైపుణ్యం, ధైర్యం అద్భుతం” అని నెటిజ‌న్లు గుకేష్‌కు విషెస్ తెలుపుతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment