గుడివాడలో ఉద్రిక్తత.. కొడాలి నానిపై అస‌భ్య‌క‌ర‌ పోస్ట‌ర్లు

గుడివాడలో ఉద్రిక్తత.. కొడాలి నానిపై అస‌భ్య‌క‌ర‌ పోస్ట‌ర్లు

కృష్ణా జిల్లా (Krishna District) గుడివాడ (Gudivada)లో ఉద్రిక్త‌త వాతావ‌ర‌ణం నెల‌కొంది. వంద‌లాది పోలీసులు గుడివాడ‌లో మోహ‌రించారు. వైసీపీ చేపట్టిన ‘బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ’ (Babu Surety Mosam Guarantee) కార్యక్రమాన్ని ఎలాగైనా అడ్డుకోవాల‌ని తెలుగుదేశం పార్టీ(TDP Party) కార్య‌క‌ర్త‌లు (Activists) రోడ్డెక్కారు. ఈ నేపథ్యంలో టీడీపీ(TDP), వైసీపీ(YSRCP) కార్యకర్తల మధ్య ఉద్రిక్తత వాతావ‌ర‌ణం నెలకొంది. కొడాలి నాని (Kodali Nani) ఫొటోలతో ఉన్న ఫ్లెక్సీలను (Flex Banners) టీడీపీ కార్యకర్తలు చించివేయడంతో పరిస్థితి మరింత వేడెక్కింది. వైసీపీ ‘బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ’ కార్య‌క్ర‌మం ఏర్పాటు చేసుకున్న కే.కన్వెన్షన్ వైపు ర్యాలీగా దూసుకొచ్చిన టీడీపీ శ్రేణులను నాగవరప్పాడు సెంటర్ వ‌ద్ద‌ పోలీసులు అడ్డుకోవడంతో పోలీసులు, టీడీపీ కార్య‌క‌ర్త‌ల మ‌ధ్య‌ తోపులాట జరిగింది.

బూట్ పాలిష్ చేస్తున్న‌ట్లుగా పోస్ట‌ర్లు
మరోవైపు, గుడివాడలో విద్వేషం రెచ్చగొట్టేలా టీడీపీ కార్యకర్తలు నెహ్రూ చౌక్ సెంటర్‌ (Nehru Chowk Centre)లో విద్వేషపూరిత పోస్టర్లు ఏర్పాటు చేశారు. మాజీ మంత్రి కొడాలి నాని చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) బూట్ పాలిష్ (Boot Polish) చేస్తున్నట్లు చూపిస్తూ టీడీపీ పేరిట ఫ్లెక్సీలు వెలిశాయి. ఈ పోస్టర్లు స్థానికంగా తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించాయి, వైసీపీ కార్యకర్తలు దీనిపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. “టీడీపీ రాష్ట్రంలో హింస, విద్వేషాన్ని ప్రోత్సహిస్తోంది. కొడాలి నానిని లక్ష్యంగా చేసుకుని ఇలాంటి దుష్ప్రచారం చేయడం దారుణం” అని వైసీపీ మండిప‌డుతోంది. ఈ కార్య‌క్ర‌మానికి వైసీపీ నేత పేర్నినాని హాజ‌రుకానున్నారు. కాగా, పేర్ని నాని కారుపై దాడులు జరిగే అవకాశం ఉందని భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ఘటన గుడివాడలో రాజకీయ ఉద్రిక్తతను మరింత పెంచింది.

వైసీపీ ‘బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ’ కార్యక్రమం ద్వారా టీడీపీ ప్రభుత్వ విధానాలపై విమర్శలు గుప్పించే ప్రయత్నం చేస్తుండగా, టీడీపీ కార్యకర్తలు ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. పోలీసులు భారీగా మోహరించారు. అయితే, గుడివాడ‌లో రాజకీయ హింస మరోసారి తలెత్తే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment