కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ఇవాళ GST కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఈ భేటీ పలు కీలక ఆర్థిక నిర్ణయాలపై కౌన్సిల్ దృష్టి సారించనుంది. ప్రత్యేకంగా, లైఫ్ అండ్ మెడికల్ ఇన్సూరెన్సులపై GST రేటు తగ్గించే విషయంపై కీలక చర్చలు జరగనున్నట్లు సమాచారం.
జొమాటో, స్విగ్గీపై GST తగ్గింపు?
ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సేవలైన జొమాటో, స్విగ్గీపై GST రేటును 5%కి తగ్గించవచ్చని సూచనలు వినిపిస్తున్నాయి. ఈవీ వాహనాలు, పెట్రోల్/డీజిల్ వాహనాలపై GST రేటును 12% నుండి 18%కి పెంచే ప్రతిపాదన కూడా చర్చకు రానుంది.
148 వస్తువులపై GST మార్పులు
జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో మొత్తం 148 వస్తువులపై GST సవరించాల్సిన ప్రతిపాదనలు ఉన్నాయని సమాచారం. ఈవెంట్లు, ఫైనాన్స్, బిజినెస్ రంగాలకు ప్రభావం చూపే పలు అంశాలపై ఈ భేటీ కీలకంగా నిలవనుంది. GST కౌన్సిల్ తీసుకునే నిర్ణయాలు ప్రజల జీవితాలపై, వ్యాపారాలపై ప్రత్యక్షంగా ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.