ఐపీఎల్ టిక్కెట్లపై భారీ జీఎస్టీ

క్రికెట్ ప్రేమికులకు భారీ షాక్.. ఐపీఎల్ టిక్కెట్లపై భారీ జీఎస్టీ

జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న కీలక నిర్ణయాలు:

12% మరియు 28% పన్ను శ్లాబులను రద్దు చేస్తూ, ఇకపై కేవలం 5% మరియు 18% శ్లాబులను మాత్రమే కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది.

ఈ నెల 22వ తేదీ నుంచి ఈ కొత్త పన్ను విధానం

ఐపీఎల్ టిక్కెట్లపై 40% జీఎస్టీ
ఐపీఎల్ వంటి పెద్ద క్రీడా ఈవెంట్ల టిక్కెట్లపై 40% జీఎస్టీ విధించనున్నట్లు జీఎస్టీ కౌన్సిల్ ప్రకటించింది.

గతంలో ఐపీఎల్ టిక్కెట్లపై 28% జీఎస్టీ ఉండేది. ఇప్పుడు ఇది 40%కి పెరిగింది. ఈ పన్ను రేటు క్యాసినోలు, రేస్ క్లబ్‌లు, లగ్జరీ ఉత్పత్తులకు సమానంగా ఉంటుంది.

కొత్త ధరలు ఇలా ఉంటాయి:
రూ. 500 టికెట్: గతంలో ఇది రూ. 640కి లభించేది. ఇకపై దీని ధర రూ. 700 అవుతుంది.

రూ. 1000 టికెట్: గతంలో ఇది రూ. 1,280కి లభించేది. ఇకపై దీని ధర రూ. 1,400 అవుతుంది.

రూ. 2000 టికెట్: గతంలో ఇది రూ. 2,560కి లభించేది. ఇకపై దీని ధర రూ. 2,800 అవుతుంది.

అయితే, అంతర్జాతీయ మరియు ఇతర క్రికెట్ మ్యాచ్ టిక్కెట్లపై పాత పన్ను రేటు అయిన 18% జీఎస్టీ మాత్రమే వర్తిస్తుందని, కేవలం ఐపీఎల్ మరియు ఇతర ప్రీమియం లీగ్‌లను మాత్రమే 40% శ్లాబులో ఉంచినట్లు తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment