తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఆధ్వర్యంలో నడిచే గోశాలలో(Goshala) గోవుల మృతి (Cows Deaths)పై తెలుగుదేశం – వైసీపీ (TDP– YSRCP) పార్టీల మధ్య రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. గోవుల మృతిపై గోశాలకు వచ్చి నిరూపించాలని బుధవారం సాయంత్రం టీడీపీ ఛాలెంజ్ విసిరింది. టీడీపీ ఛాలెంజ్ (Challenge)ను స్వీకరించిన వైసీపీ నేత.. 10 గంటలకు గోశాలలో కలుద్దామని రిప్లయ్ ఇచ్చారు. గురువారం ఉదయం నుంచి తిరుపతిలో హైడ్రామా నడుస్తోంది. గోశాలకు బయల్దేరిన వైసీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి (Bhuma Karunakar Reddy)ని, తిరుపతి పట్టణంలోని వైసీపీ నేతలను అడ్డుకున్న ఫొటోలు (Photos) , వీడియోలను (Videos) వైసీపీ తన అధికారిక ట్విట్టర్ (Official Twitter)లో పోస్ట్ చేసింది.
గోశాలకు వెళ్లేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, పోలీసుల నిర్బంధం తొలగించాలని కోరుతూ భూమన కరుణాకర్‌రెడ్డి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు (Palla Srinivasarao) కు ఫోన్ (Phone Call) చేశారు. రోడ్డుపై పడుకొని నిరసన వ్యక్తం చేస్తూ పల్లా శ్రీనివాసరావుకు ఫోన్ చేయగా, ఆయన ఫోన్ కట్ (Cut) చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఛాలెంజ్ విసిరిన టీడీపీ నేతలే పోలీసుల చేత వైసీపీ నేతలను అడ్డుకుంటున్నారనే విషయం చర్చనీయాంశంగా మారింది. రోడ్డుపై బైఠాయించిన వైసీపీ నేతల ఫొటోలు, వీడియోలు వైరల్ కావడంతో టీడీపీ అప్రమత్తమైంది.
వైసీపీ వీడియో వైరల్ కావడంతో..
పోలీసుల బందోబస్తు నడుమ అధికార పార్టీ ఎమ్మెల్యేలు (Ruling Party MLAs) గోశాల వద్దకు అప్పటికే చేరుకున్నారు. పోలీసులు అడ్డుకోవడంతో ఆగిపోయిన భూమన కరుణాకర్‌రెడ్డికి ఫోన్ చేసి ఎస్కార్ట్ (Escort) పంపిస్తాం, రావాలని చెప్పారు. భూమనతో ఫోన్‌లో మాట్లాడటాన్ని వీడియో తీశారు. టీడీపీ అధ్యక్షుడు పల్లాకు భూమన ఫోన్ చేసిన వీడియో వైరల్ కావడంతో, దానికి ప్రతిగా టీడీపీ భూమనకు ఫోన్‌చేసిన వీడియోను వదిలింది. ఎమ్మెల్యేలు ఫోన్ చేసి భూమన కరుణాకర్‌రెడ్డిని రావాలని కోరుతున్నారన్న ప్రచారం మొదలుపెట్టారు. దీంతో గోమాతల మృతి వివాదం కాస్త.. ఫోన్‌కాల్స్ ప్రచారం వైపు డైవర్ట్ (Divert) అయ్యిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
“బ్రాహ్మణులపై మూత్రం పోస్తా” – అనురాగ్ కశ్యప్ వివాదాస్పద వ్యాఖ్య