వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతీరెడ్డిని (YS Bharathi Reddy) అసభ్యకరంగా దూషించిన ఐటీడీపీ (ITDP) కార్యకర్తపై దాడికి యత్నం కేసులో అరెస్టు అయిన వైసీపీ (YSR Congress Party) మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ (Gorantla Madhav)కు సోమవారం సాయంత్రం బెయిల్ (Bail) మంజూరైంది. గుంటూరు కోర్టు (Guntur Court) షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈనెల 11వ తేదీ నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఆయన రిమాండ్‌లో ఉన్నారు. తాజాగా బెయిల్ పత్రాలు సమర్పించిన నేపథ్యంలో, గోరంట్ల మాధవ్ ఇవాళ రాజమండ్రి జైలు (Rajahmundry Jail) నుంచి విడుదల (Release) అయ్యే అవకాశం ఉంది.
కోర్టు విధించిన షరతులు
గోరంట్ల మాధవ్ విడుదలకు సంబంధించి న్యాయస్థానం కొన్ని కీలకమైన షరతులు విధించింది. ప్రతి శనివారం గుంటూరునగరంలోని పాలెం పోలీస్ స్టేషన్‌కి (Pallem Police Station) వెళ్లి హాజరై సంతకం చేయాలని ఆదేశించింది. ఈ విధానం రెండు నెలల పాటు కొనసాగాలని సూచించింది. గోరంట్ల మాధవ్‌కు రూ.10,000 పూచీకత్తుతో పాటు ఇద్దరు వ్యక్తుల హామీపై బెయిల్ మంజూరైంది. గోరంట్ల మాధవ్ తో పాటు రాజమండ్రి జైలులో రిమాండ్ లో ఉన్న ఐదుగురు అనుచరులకు (Associates) కూడా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. గతనెల 10వ తేదీన ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ (Chebrolu Kiran) తో పాటు ఎస్కార్ట్ (Escort) పోలీసులపై దాడి చేసిన ఘటనలో గోరంట్ల మాధవ్ ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.