---Advertisement---

సినీ ఫక్కీలో 6.5 కిలోల బంగారం చోరీ.. పోలీసులకు సవాల్!

సినీ ఫక్కీలో 6.5 కిలోల బంగారం చోరీ.. పోలీసులకు సవాల్!
---Advertisement---

ఎన్టీఆర్ జిల్లా జ‌గ్గ‌య్య‌పేట వ‌ద్ద సినీ ఫ‌క్కీలో బంగారం చోరీ జ‌రిగింది. సంచలనం సృష్టించిన బంగారం దొంగతన ఘటన పోలీసులకే సవాల్‌గా మారింది. వివ‌రాల్లోకి వెళితే.. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో 6.5 కిలోల రూ.10 కోట్ల విలువైన బంగారంతో ఓ కారు డ్రైవర్ ఉడాయించాడు. కిషన్ లాల్ అనే వ్యాపారి బంగారం ఆభరణాలు డెలివరీ చేయడానికి కారులో విజయవాడ బయలుదేరాడు. ఈ క్రమంలో రోడ్డు పక్కన టీ తాగుతుండగా ఇదే అదనుగా భావించిన డ్రైవర్ ఒక్కసారిగా కారు, బంగారంతో ఉడాయించాడు. కారును మునగచెర్ల వద్ద వదిలేసి బంగారంతో పారిపోయాడు. వ్యాపారి జగ్గయ్యపేట మండలం చిలకలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

సీసీటీవీ విజువల్స్‌తో గాలింపు వేగవంతం
నందిగామ వద్ద ఓ హోటల్‌లో టీ తాగుతున్న జితీశ్ సీసీటీవీ పుటేజీలో రికార్డు అయ్యాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కేసు పట్ల సీరియస్‌గా ఉన్న పోలీసులు జితీశ్ కోసం నాగ్‌పూర్, జబల్‌పూర్, హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో ప్రత్యేక గాలింపు చర్యలు చేపట్టారు. ఈ కేసులో త్వరలోనే చేధిస్తామని, నిందితుడిని పట్టుకొని బంగారాన్ని రికవర్ చేస్తామని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment