బాక్సింగ్ దిగ్గజం జార్జ్ ఫోర్‌మాన్ కన్నుమూత

బాక్సింగ్ దిగ్గజం జార్జ్ ఫోర్‌మాన్ కన్నుమూత

ప్రపంచ బాక్సింగ్ దిగ్గ‌జం జార్జ్ ఫోర్‌మాన్ (76) ఇక లేరు. అనారోగ్యంతో శుక్రవారం ఆయన మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ప్రకటించారు. “ఫోర్‌మాన్ మ‌ర‌ణ‌వార్త‌తో మా హృదయాలు బద్దలయ్యాయి. గొప్ప భర్త, ప్రేమగల తండ్రి, గర్వించదగిన తాత” అంటూ ఫోర్‌మాన్ కుటుంబం భావోద్వేగ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ఫోర్‌మాన్ 1968 ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఆ తర్వాత రెండు సార్లు హెవీవెయిట్ ఛాంపియన్‌గా కీర్తిని గడించారు. తన కెరీర్‌లో 68 విజయాల్లో 5 మాత్రమే ఓటమి చెందారు. 1974లో మహమ్మద్ అలీతో జరిగిన “రంబుల్ ఇన్ ద జంగిల్” పోరులో ఓటమి పాలయ్యారు.

బాక్సింగ్ తర్వాత వ్యాపార రంగంలో విజయం
1977లో ఫోర్‌మాన్ బాక్సింగ్‌కు రిటైర్ అయినా, 1990లలో మళ్లీ రింగ్‌లోకి వచ్చారు. చివరగా, వ్యాపార రంగంలో తన సత్తా చాటారు. “జార్జ్ ఫోర్‌మాన్ గ్రిల్” అనే కిచెన్ ఉత్పత్తితో ప్రపంచవ్యాప్తంగా బ్రాండ్‌గా మారిపోయారు. జార్జ్ ఫోర్‌మాన్ కేవలం బాక్సింగ్ లెజెండ్ మాత్రమే కాదు, జీవన విధానంలో ఓ ప్రేరణాత్మక శక్తి. ఆయన చూపిన మార్గం, అందించిన స్ఫూర్తి ఎప్పటికీ నిలిచిపోతాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment