జడేజాలో ఆ లక్షణాలే నన్ను ఆకట్టుకున్నాయి

జడేజాలో ఆ లక్షణాలే నన్ను ఆకట్టుకున్నాయి.. ఇంగ్లండ్ దిగ్గజం ప్రశంసలు

Summarize with AI

భారత స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాపై(Ravindra Jadeja) ఇంగ్లండ్ క్రికెట్ దిగ్గజం జెఫ్రీ బాయ్‌కాట్(Geoffrey Boycott) మరోసారి ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రస్తుత తరంలో తనకు అత్యంత ఇష్టమైన క్రికెటర్ జడేజానే అని పేర్కొన్న బాయ్‌కాట్.. అతడి బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్‌తో పాటు వ్యక్తిత్వాన్ని కూడా ప్రత్యేకంగా కొనియాడాడు. జడేజా ఎంతో హ్యాండ్సమ్‌గా(Handsome) ఉంటాడని, మంచి వ్యక్తిత్వం కలిగిన ఆటగాడని చెప్పాడు.

‘‘జడేజా అద్భుతంగా బౌలింగ్(Bowling) చేస్తాడు. అతడి ఫీల్డింగ్ ఇంకా అద్భుతం. బ్యాటింగ్‌లోనూ(Batting) బాధ్యతగా ఆడగలడు. నేను అతడిని మొదటిసారి కలిసినప్పుడు నువ్వే నా ఫేవరెట్ క్రికెటర్ అని చెప్పాను. అందుకు జడేజా ఆశ్చర్యపోయాడు. కానీ నేను నిజంగానే చెప్పాను’’ అని బాయ్‌కాట్ ఓవర్‌ల్యాప్ క్రికెట్(Overlap Cricket) యూట్యూబ్ కార్యక్రమంలో వెల్లడించాడు. జడేజా మైదానంలో చూపించే ఎనర్జీ, పోరాట పటిమ జట్టులోని ఇతర ఆటగాళ్లపై కూడా సానుకూల ప్రభావం చూపుతాయని ప్రశంసించాడు.

జడేజాలో తనకు నచ్చే ఎన్నో లక్షణాలు ఉన్నాయని బాయ్‌కాట్ పేర్కొన్నాడు. ఫీల్డింగ్‌లో పూర్తి శక్తిని ప్రదర్శించడం, బ్యాటింగ్‌లో చివరి వరకు పోరాడటం, బౌలింగ్‌లో ఖచ్చితత్వంతో రాణించడం అతడిని ప్రత్యేక ఆటగాడిగా నిలబెడుతున్నాయని చెప్పాడు.

నవ్వుతూ కనిపించినప్పటికీ మైదానంలో ఎంతో కఠినమైన పోటీ తత్వంతో ఆడతాడని, అతడు సంపూర్ణ ఆల్‌రౌండర్ అని కొనియాడాడు. కాగా, జడేజా టెస్టు క్రికెట్‌లో 4,000 పరుగులు, 350 వికెట్ల మైలురాయిని అందుకున్న నాలుగో ఆటగాడిగా నిలిచాడు. ఇయాన్ బోథమ్, డేనియల్ వెట్టోరి, కపిల్ దేవ్ తర్వాత ఈ ఘనత సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.

దశాబ్దానికి పైగా భారత జట్టులో మూడు విభాగాల్లో కీలకంగా కొనసాగుతున్న జడేజా.. 2013 ఛాంపియన్స్ ట్రోఫీ, 2024 టీ20 ప్రపంచకప్ విజయాల్లోనూ భాగస్వామిగా ఉన్నాడు. టీ20 అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ టెస్టులు, వన్డేల్లో కొనసాగుతున్న జడేజా.. 2027 వన్డే ప్రపంచకప్‌ను లక్ష్యంగా చేసుకుని కెరీర్‌ను కొనసాగిస్తున్నాడు.

Join WhatsApp

Join Now

Leave a Comment