మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘గేమ్ ఛేంజర్’ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఒక అభిమాని ట్రైలర్ కోసం ఎదురు చూస్తూ, తన భావోద్వేగాలను వ్యక్తం చేస్తూ రాసిన లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
ట్రైలర్ డేట్ లేక బాధలో..
ఆ లేఖలో అభిమాని తన బాధను వ్యక్తపరుస్తూ.. చరణ్ అన్న ఫ్యాన్ చింతిస్తూ రాయునది ఏమనగా.. సినిమాకి ఇంకా 13 రోజులే మిగిలి ఉన్నది. మీరు ఏ విధమైన ట్రైలర్ అప్‌డేట్ ఇవ్వట్లేదు.కనీసం అభిమానుల ఎమోషన్‌ని పట్టించుకోవట్లేదు. “ఈ నెల చివరికి ట్రైలర్ రిలీజ్ చేయకపోతే నేను ఆత్మహత్యకు పాల్పడతాను” అని అభిమాని పేర్కొన్నాడు. ఈ లేఖను మూవీ టీమ్‌ను హెచ్చరిస్తూ రాసినట్లుగా ఉంది.
ఈ లేఖ చదివిన తర్వాత నెటిజన్లు దీనిపై విభిన్న రీతుల్లో స్పందిస్తున్నారు. కొందరు ఈ చర్యను తప్పుబడుతుండగా, మరికొందరు మాత్రం ట్రైలర్ విడుదలకు దర్శకుడు, నిర్మాతలపై ఒత్తిడి పెంచుతున్నారు. ‘గేమ్ ఛేంజర్’ వంటి ప్రతిష్ఠాత్మక చిత్రానికి ఇలాంటి సంఘటనలు ఎదురవడం హద్దులు దాటిన అభిమానం కలిగించిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.