బిగ్ సర్‌ప్రైజ్.. ‘గేమ్ ఛేంజర్’లో తెలుగు రాష్ట్రాల రాజ‌కీయ ప‌రిస్థితులు

బిగ్ సర్‌ప్రైజ్.. 'గేమ్ ఛేంజర్'లో తెలుగు రాష్ట్రాల రాజ‌కీయ ప‌రిస్థితులు

డల్లాస్‌లో జరిగిన ఈవెంట్‌లో ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ, “‘గేమ్ ఛేంజర్’లో మీరు థియేటర్లో చూసే అనేక సంఘటనలు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న పరిస్థితులను ప్రతిబింబిస్తాయి. అయితే, ఆ సీన్స్‌ను దర్శకుడు శంకర్ నాలుగేళ్ల క్రితమే రాశారు. ఈ సినిమా హై ఓల్టేజీ ఎమోషన్‌తో ప్రేక్షకుల నుండి విశేషమైన క్లాప్స్ సంపాదిస్తుంది. ఇది తెలుగు ప్రేక్షకులతో పాటు అన్ని భాషల వారికి విభిన్నమైన అనుభూతిని అందిస్తుంది” అని చెప్పారు.

దిల్ రాజు ప్రకటన ప్రకారం, ఈ సినిమా కేవలం ఓ యాక్షన్ డ్రామా మాత్రమే కాకుండా, సమాజాన్ని ప్రతిబింబించే అంశాలతో కూడా నిండిపోవడాన్ని స్పష్టమవుతుంది. ఇది ప్రేక్షకుల మనసుకు పెద్దగా తగిలే విధంగా ఉండబోతుందని సూచిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment