బైక్‌పై 24 దేశాలు చుట్టేసిన యువ‌ దంప‌తులు

బైక్‌పై 24 దేశాలు చుట్టేసిన యువ‌ దంప‌తులు

ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖ్‌నవూకు చెందిన యువ దంపతులు 120 రోజుల్లో 24 దేశాలు చుట్టి ప్రపంచాన్ని ఆకర్షించారు. 20,000 కిలోమీటర్లు ద్విచక్ర వాహనంపై ప్రయాణించి, ఇటలీ, ఫ్రాన్స్, నార్వే, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా సహా అనేక దేశాలను సందర్శించారు దంప‌తులు ప్రతీక్, శిఖా.

గిన్నిస్ రికార్డు నుంచి యూరప్ టూర్‌ వరకు
2017లో పెళ్లయిన ఈ జంట లేహ్ నుంచి కన్యాకుమారి వరకు 4,000 కిలోమీటర్ల బైక్ రైడ్‌ను కేవలం 6 రోజుల్లో పూర్తి చేసి గిన్నిస్ రికార్డు సాధించారు. దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలను బైక్‌పైనే వీరి ప్రయాణం కొనసాగింది. 2019లో యూరప్ టూర్ ప్లాన్ చేసినా, కొవిడ్ కారణంగా వాయిదా పడింది. 2024లో అన్ని వీసా ప్రక్రియలు పూర్తి కావడంతో ఆగస్టులో రోమ్‌ నుంచి రైడ్‌ మొదలుపెట్టి నవంబరులో లండన్‌కు చేరుకున్నారు.

ప్రయాణం వెనుక కష్టాలు, ఖర్చులు
ఈ ప్రపంచ యాత్ర కోసం 5 ఏళ్ల పాటు డబ్బు ఆదా చేసిన ఈ జంట, రూ. 55 లక్షల ఖర్చుతో ఈ ట్రిప్‌ను పూర్తిచేశారు. బైక్‌ను విమానంలో ఇటలీకి తీసుకెళ్లి, రోజూ 6-8 గంటల పాటు ప్రయాణించడంతో పాటు, భోజనం కూడా స్వయంగా వండుకునే సౌలభ్యాన్ని ఎంచుకున్నారు. వీరి సాహ‌సాన్ని యువ‌త కొనియాడుతోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment