ఉచిత బస్సు పథకంపై గందరగోళం – జనసేన నేత ఆడియో సంచలనం

ఏలూరు ఏజెన్సీ (Eluru Agency) ప్రాంతాల్లో ఉచిత బస్సు పథకం (Free Bus Scheme) అమలుపై పెద్ద ఎత్తున గందరగోళం నెలకొంది. ఏ బస్సులో ఫ్రీ టికెట్ వర్తిస్తుందో, ఏదిలో వర్తించదో అన్న అనుమానాలతో మహిళలు (Women) సహా ప్రయాణికులు (Passengers) తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా అంతర్రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన జంగారెడ్డిగూడెం–కుక్కునూరు మార్గాల్లో ఈ సమస్య మరింత ఎక్కువైంది.

జంగారెడ్డిగూడెం (Jangareddygudem) డిపో (Depot) నుంచి భద్రాచలం, అశ్వరావుపేట దిశగా వెళ్లే బస్సులు ఎక్కువగా తెలంగాణ(Telangana)లోకి ప్రవేశించడం వల్ల ఫ్రీ పథకం వర్తించదని అధికారులు స్పష్టం చేశారు. దీనిపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బస్ డిపో డీఎంతో జరిగిన సంభాషణలో జనసేన నేత(Janasena Leader) నిలదీసిన ఆడియో(Audio) సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వివాదం మరింత చెలరేగింది.

ప్రయాణికులు, ముఖ్యంగా మహిళలు, ఉచిత పథకాన్ని వాస్తవ రూపంలో అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు విరుద్ధంగా షరతులు పెట్టడం సరైంది కాదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తిరుపతి–తిరుమల బస్సులకూ పరిమితులు పెట్టడం భక్తుల్లో అసంతృప్తి కలిగించగా, కూటమి సర్కార్‌పై విమర్శల తుఫాన్ ముసురుకుంది.

Join WhatsApp

Join Now

Leave a Comment