ఏపీలో మ‌హిళ‌ల‌కు ఉచిత బస్సు ప్ర‌యాణం ఎప్పుడంటే..

ఏపీలో మ‌హిళ‌ల‌కు ఉచిత బస్సు ప్ర‌యాణం ఎప్పుడంటే..

ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోనుంది. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఆర్టీసీ అధికారులు ఇప్పటికే తమ నివేదికను సమర్పించగా, సంక్రాంతి పండుగకు ఈ పథకాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం ప్రణాళికలు చేస్తోంది.

మహిళల ప్రయాణానికి మేలుకొలుపు
ఈ పథకం అమలుతో మహిళల కోసం ఉచిత ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి రానుంది. ఇది వారికే ప్రత్యేకంగా డిజైన్ చేసిన పథకమని ప్రభుత్వం భావిస్తోంది. సంక్రాంతి వేళ ఈ పథకం ప్రారంభం అయితే మ‌హిళ‌లు ఉచితంగా బ‌స్సుల్లో ప్ర‌యాణం చేయ‌నున్నారు. ఈ ప‌థ‌కం అమ‌లులో ప్ర‌భుత్వం ఎలాంటి నిబంధ‌న‌లు విధిస్తుందో వేచిచూడాలి.

తెలంగాణ మాదిరిగా ప‌ల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌ల‌లో మాత్ర‌మే ఉచిత ప్ర‌యాణానికి అనుమ‌తిస్తారా, లేక ల‌గ్జ‌రీ బ‌స్సుల్లోనూ ప్ర‌యాణం చేసే వెసులుబాటు క‌ల్పిస్తారా అనేది అంద‌రిలో మెదిలే సందేహం.

Join WhatsApp

Join Now

Leave a Comment