మాజీ ఎంపీ మందా జగన్నాథం కన్నుమూత

మాజీ ఎంపీ మందా జగన్నాథం కన్నుమూత

నాగర్కర్నూల్ మాజీ ఎంపీ మందా జగన్నాథం అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి కన్నుమూశారు. ఆయన మరణం తెలంగాణ రాజకీయాలకు పెద్ద లోటుగా భావించబడుతోంది. 1951, మే 22న పాలమూరు జిల్లా ఇటిక్యాలలో జన్మించిన జగన్నాథం, మెడిసిన్ చదివి కొంతకాలం డాక్టరుగా సేవలందించిన తరువాత రాజకీయాల్లోకి అడుగేశారు.

రాజకీయ ప్రస్థానం
1996లో తెలుగుదేశం పార్టీలో చేరిన మందా జ‌గ‌న్నాథం మహబూబ్‌నగర్ జిల్లాలోని నాగర్ కర్నూల్ పార్లమెంటు స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు. ఆ త‌రువాత‌ 1999, 2004 తెలుగుదేశం పార్టీ నుంచి ఎంపీగా గెలుపొందారు. 2009 కాంగ్రెస్ తరఫున విజయాన్ని సాధించారు. 2014 బీఆర్‌ఎస్ తరఫున పోటీ చేసి ఓడిపోయారు.

2018లో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా న్యూఢిల్లీలో నియమించింది. ఈ పదవికి కేబినెట్ హోదా కూడా కేటాయించారు. పదవీకాలం ముగిసిన తరువాత మరోసారి అదే పదవిలో కొనసాగించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2023లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల అనంతరం 2024 బీఎస్పీ పార్టీలో చేరినా, ఆ తరువాత రాజకీయాలకు దూరంగా ఉంటూ విశ్రాంతి జీవితం గడిపారు. మందా జగన్నాథం రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. ప్రజాసేవకుడిగా, ఒక మెడికల్ ప్రొఫెషనల్‌గా ఆయన అందించిన సేవలు చిరస్మరణీయం.

Join WhatsApp

Join Now

Leave a Comment