వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి విడదల రజినీ (Vidadala Rajini) పై పోలీసులు దౌర్జన్యం ప్రదర్శించారు. పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం మానుకొండవారి పాలెంలో ఓ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన మాజీ మంత్రి విడదల రజిని పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది. మాజీ మంత్రి పట్ల సీఐ (CI – Circle Inspector) దురుసు ప్రవర్తన (Rude Behavior)వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మాజీ మంత్రి విడదల రజిని మానుకొండవారిపాలెం వెళ్తున్నారు. పోలీసులు మాజీ మంత్రి కాన్వాయ్(convoy)ని ఆపేసి ఆమె కారులో ఉన్న అనుచరుడు శ్రీకాంత్ (Sreekanth) ను అరెస్ట్ చేయడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారో చెప్పాలని విడదల రజిని పోలీసులను ప్రశ్నించారు. మాజీ మంత్రి ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా, ఎలాంటి నోటీసులు చూపకుండా కారులో ఉన్న శ్రీకాంత్‌ను తీసుకువెళ్లే క్రమంలో పోలీసులు హంగామా సృష్టించారు. తన ప్రశ్నకు సమాధానం ఇవ్వాలని సీఐ గారూ అంటూ మాజీ మంత్రి విడదల రజినీ కోరాగా, సీఐ సుబ్బరాయుడు మాత్రం ఆమెపై దురుసుగా ప్రవర్తించడమే కాకుండా.. కారు డోర్ తీసే క్రమంలో ఆమెను నెట్టేశారు. అంతటితో ఆగకుండా మాజీ మంత్రిపై కేసు పెడతానంటూ బెదిరించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మాజీ మహిళా మంత్రి అని కూడా చూడకుండా విడదల రజినీ పట్ల అమానుషంగా వ్యవహరించిన సీఐ సుబ్బరాయుడు తీరుపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. మహిళా నేత పట్ల వ్యవహరించే తీరు ఇదేనా..? అని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. పాకిస్తాన్‌తో యుద్ధం చేస్తున్న భారత సైన్యానికి దేశమంతా మద్దతుగా నిలుస్తుంటే.. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం అరెస్టుల పర్వం కొనసాగుతోందంటూ రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
మాజీమంత్రి విడదల రజిని ప్రధాన అనుచరుడు శ్రీకాంత్ రెడ్డి అరెస్టు..
— Telugu Feed (@Telugufeedsite) May 10, 2025
మాజీ మంత్రి కారులో ఉన్న శ్రీకాంత్‌ను తీసుకెళ్లడానికి యత్నించిన పోలీసులు..
ఏ కేసులో అరెస్టు చేస్తున్నారో చెప్పాలని కోరగా, మీ పైన కూడా కేసు పెడతానంటూ బెదిరించిన సీఐ సుబ్బరాయుడు#AndhraPradesh #YSRCP… pic.twitter.com/JwAUk5Fxbb