ప‌వ‌న్ మ‌హిళా ద్రోహి.. న‌వ మాసాల్లో న‌వ‌ మోసాలు – ఆర్కే రోజా ఫైర్‌

ప‌వ‌న్ మ‌హిళా ద్రోహి.. న‌వ మాసాల్లో న‌వ‌ మోసాలు - ఆర్కే రోజా ఫైర్‌

కూటమి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన న‌వ‌ మాసాల్లో మహిళలకు నవ మోసాలు చేసింద‌ని, మ‌హిళ‌ల‌ను వంచించిన చంద్ర‌బాబు ప్రభుత్వానికి అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరిపే అర్హత లేదని మాజీ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. శ‌నివారం తాడేప‌ల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాల‌యంలో ఆర్కే రోజా మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వంలో మహిళలు నరకాన్ని అనుభవిస్తున్నారన్నారు. మహిళలు సంతోషంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోలేని స్థితి రాష్ట్రంలో లేద‌న్నారు. మహిళలంతా భయం.. భయంగా బతుకుతున్నారన్నారు. మహిళలపై వేధింపులు ఎక్కువ‌య్యాయి.. మహిళా భద్రత క‌రువైందని ఆర్కే రోజా విమ‌ర్శించారు.

చంద్ర‌న్న ప‌గ‌.. చంద్ర‌న్న ద‌గా..
మ‌హిళా ర‌క్ష‌ణ కోసం వైఎస్ జగన్ దిశాయాప్, దిశా పోలీస్ స్టేషన్లు, మహిళా పోలీసులను తీసుకువచ్చార‌ని, వాటిని కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆర్కే రోజా మండిప‌డ్డారు. సీఎం చంద్రబాబు, డీసీఎం పవన్, హోమంత్రి అనితకు మహిళలు అంటే గౌరవం, అభిమానం లేదన్నారు. చంద్రబాబు సీఎం అయిన తరువాత చంద్రన్న పగ.. చంద్రన్న దగా.. చంద్రన్న మోసం.. తల్లికి పంగనామం.. నిరుద్యోగులకు వెన్నుపోటులతో పాలనను సాగిస్తున్నార‌ని ఆరోపించారు.

ప‌సుపు కుంకుమ‌ల‌తో చెల‌గాటం..
వైఎస్ జగన్ త‌న ఐదేళ్ల పాలనలో మ‌హిళ‌లు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా నిలదొక్కుకునేలా చేశార‌ని ఆర్కే రోజా గుర్తుచేశారు. జ‌గ‌న్ ఒక అన్నగా, తమ్ముడిగా, తండ్రిగా అందరి గుండెల్లో గుడి కట్టుకున్నారన్నారు. ఇళ్ల‌ స్థలాలు, పక్కాగృహాలు, చేయూత, ఆసరా, అమ్మ ఒడి, సున్నా వడ్డీ, ఇలా అన్ని మహిళల పేరు మీద ఇచ్చారన్నారు. రాజకీయంగా 50 శాతం నామినేటెడ్ పోస్ట్‌లు మహిళలకు కల్పించి, వారిని అన్ని విధాలుగా ప్రోత్సహించిన ఘ‌న‌త జ‌గ‌న్‌ద‌న్నారు. రాష్ట్రంలో ప్రతి రోజూ సగటున 70 మంది మహిళలు, వృద్దులు, చిన్నపిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయని ఆర్కే రోజా ఆవేద‌న వ్య‌క్తం చేశారు. 50 వేల‌కు పైగా బెల్ట్ షాప్ లు పెట్టి, ఆడవారి పసుపు కుంకుమలతో చెలగాటం ఆడుతున్నార‌న్నారు.

ఆ 30 వేల మందిలో ఎంత‌మందిని ర‌క్షించారు?
గత ఐదేళ్ల‌లో ఊగిపోతూ, అరుస్తూ మహిళల కోసం మాట్లాడిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఆడ‌వారి ర‌క్ష‌ణ‌కు తీసుకున్న చ‌ర్య‌లేంట‌ని ప్ర‌శ్నించారు. జగన్ ప్రభుత్వంలో 30 వేల మంది మహిళలు అక్రమ రవాణా అయ్యారని ఆరోపించిన ప‌వ‌న్.. కేంద్ర స‌హ‌కారంతో వారిలో ఎంత‌మందిని తీసుకొచ్చార‌ని ప్ర‌శ్నించారు. రాజకీయం కోసం ఆడబిడ్డలను అడ్డం పెట్టుకుని జగన్‌పై దుష్ప్రచారం చేస్తారా? అని ప‌వ‌న్‌పై మండిప‌డ్డారు. పవన్ కళ్యాణ్ ఒక మహిళా ద్రోహి అని, సుగాలి ప్రీతి కేసు విషయంలో ఆయన వ్యవహారశైలి చూస్తే అందరికీ అర్థ‌మవుతుంద‌న్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment