ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్ర ఆర్థిక పరిస్థితి (State Financial Condition)పై వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి (Former Chief Minister) వై.ఎస్. జగన్‌మోహన్ రెడ్డి (Y.S. Jaganmohan Reddy) తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) (CAG – Comptroller and Auditor General) గణాంకాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా దిగజారిందో స్పష్టంగా చూపిస్తున్నాయన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో రాష్ట్ర సొంత ఆదాయాలు కేవలం 3.47% పెరగగా, కేంద్ర నిధులతో కలుపుకొని మొత్తం ఆదాయం 6.14% మాత్రమే పెరిగిందని జగన్ తెలిపారు. అప్పులు 15.61% వేగంగా పెరుగుతున్నాయని, ఇది ఆర్థిక అస్థిరత్వానికి సంకేతమని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారిపోయిందని గణాంకాలతో సహా వివరిస్తూ వైఎస్ జగన్ సంచలన ట్వీట్ చేశారు.
రాష్ట్రంలో అత్యథిక స్థాయిలో పెరిగిపోయిన అవినీతి (Corruption) కారణంగా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయ వనరులన్నింటిలోనూ పెరుగుదల అనేది నిరాశాజనకంగా మారిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సొంత పన్ను ఆదాయం (Revenue), సర్వీస్ (Service), సేల్స్ టాక్స్ (Sales Tax) ఆదాయాల్లో భారీగా తగ్గుదల కనిపించిందన్నారు. ఇది ప్రభుత్వ ఖర్చులన్నింటికీ సొంత ఆదాయంపై ఆధారపడకుండా అప్పులపై మీద ఆధారపడే పరిస్థితిని తీసుకొచ్చిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరి పరిస్థితి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మరింత దిగజార్చే ప్రమాదం ఉందని, చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) నేతృత్వంలోని టీడీపీ ప్రభుత్వం అవినీతి (TDP Government Corruption), అసమర్థ పరిపాలనతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని ఆయన విమర్శించారు.
సామాన్యంగా వినియోగాన్ని ప్రతిబింబించే జీఎస్టీ, సేల్స్ టాక్స్ వసూళ్లలో ఈ ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలల్లో తగ్గుదల కనిపించడంతో రాష్ట్ర ఆర్థిక స్థితి ఎలా మౌలికంగా దెబ్బతినిందో అర్థమవుతోందని వైఎస్ జగన్ అన్నారు. గత ఏడాది ఇదే కాలానికి పోలిస్తే ఈ ఏడాది తొలి త్రైమాసికంలో రాష్ట్ర సొంత ఆదాయం కేవలం 3.47% మాత్రమే పెరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే ఆదాయాలూ కలిపితే మొత్తంగా 6.14% పెరుగుదల నమోదైందని, కానీ, అప్పులు మాత్రం అదే కాలంలో 15.61% పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. అంటే, అభివృద్ధికి కావలసిన ఖర్చులు, సంక్షేమానికి అవసరమైన పెట్టుబడులన్నీ కూడా సొంత ఆదాయాలతో కాకుండా అప్పులతో నెట్టుకువస్తున్నారని స్పష్టంగా అర్థం అవుతోందని వైఎస్ జగన్ లెక్కలతో సహా వివరించారు.
Fiscal stress worsens in the first quarter of this financial year
— YS Jagan Mohan Reddy (@ysjagan) July 26, 2025
The CAG uploaded the Monthly Key Indicators for the first quarter of this financial year and these figures very clearly suggest a precarious outlook for the financial stability of the State Government, Public… pic.twitter.com/0tYnKfNSQi







