ఫిష్ వెంకట్‌కు అండ‌గా ప్ర‌భాస్‌.. భారీ సాయం

ఫిష్ వెంకట్‌కు ప్రభాస్ అండ..కిడ్నీ మార్పిడికి ఆర్థిక సాయం!

టాలీవుడ్ నటుడు (Tollywood Actor) ఫిష్ వెంకట్(Fish Venkat) ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తోంది. కొద్ది రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ప్రస్తుతం బోడుప్పల్‌ (Booduppal)లోని ఆర్బీఎం ఆస్పత్రి (RBM Hospital)లో ఉన్నారు. పూర్తిగా మాట్లాడలేని స్థితిలో ఉన్న వెంకట్ గురించి ఆయన కూతురు (Daughter) స్రవంతి (Sravanthi) మీడియాతో మాట్లాడింది.

రెండు కిడ్నీలు పాడయ్యాయి.. ఆపరేషన్‌కు రూ. 50 లక్షలు అవసరం
చాలా ఏళ్ల క్రితమే తన తండ్రి రెండు కిడ్నీలు పూర్తిగా చెడిపోయాయని స్రవంతి వెల్లడించారు. సుమారు నాలుగేళ్ల నుంచి డయాలసిస్ (Dialysis) ద్వారానే తన తండ్రి ప్రాణాలను కాపాడుకుంటున్నామని తెలిపారు. అయితే, ఇప్పుడు పరిస్థితి క్లిష్టంగా మారిందని, ఆపరేషన్ చేసి కనీసం ఒక కిడ్నీ అయినా మార్చాల్సిన పరిస్థితి ఉందని స్రవంతి ఆవేదన వ్యక్తం చేశారు. అందుకు రూ. 50 లక్షల వరకు ఖర్చు అవుతుందని, దాతలు ఎవరైనా సాయం చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

తన తండ్రి ఆరోగ్యం క్షీణించడం, ఆపరేషన్‌కు కావాల్సినంత డబ్బు లేకపోవడంతో తాము తీవ్ర ఆందోళన చెందుతున్నామని, ఈ దీనస్థితిలో తమను ఆదుకోవాలని ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు.

ప్రభాస్ టీమ్ నుంచి కాల్.. ఆర్థిక సాయానికి హామీ!
తాజాగా, స్రవంతి మీడియాతో మరోసారి మాట్లాడుతూ ఓ శుభవార్తను పంచుకున్నారు. హీరో ప్రభాస్ (Hero Prabhas) టీమ్ (Team) నుంచి తమకు కాల్(Call) వచ్చిందని తెలిపారు. ప్రభాస్ అసిస్టెంట్ ఫోన్ చేసి, “కిడ్నీ ఇచ్చే డోనర్ (దాత) ఉంటే ఏర్పాట్లు చేసుకోండి. ఆపరేషన్‌కు కావాల్సిన డబ్బు ఏర్పాటు చేస్తాం” అని హామీ ఇచ్చారని స్రవంతి చెప్పారు.

దాత కోసం వెతుకులాట
తన తండ్రి రక్తపు గ్రూపుతో మ్యాచ్ అయ్యే దాతల కోసం ఎదురుచూస్తున్నట్లు స్రవంతి తెలిపారు. “నా రక్తం గ్రూప్ మ్యాచ్ కాకపోవడంతో డాక్టర్లు తిరస్కరించారు. నాన్న తమ్ముడి బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయింది. కానీ, ఆయనకు అనారోగ్య సమస్యలు ఉండటంతో డాక్టర్లు వద్దన్నారు. దాతలు ఎవరైనా ఉన్నారేమోనని పలు డోనర్ సంస్థలను సంప్రదిస్తున్నాం” అని ఆమె పేర్కొన్నారు.

ఫిష్ వెంకట్ తెలుగులో పలు సినిమాల్లో నటించి గుర్తింపు పొందారు. ఆది, గబ్బర్ సింగ్, నాయక్, బన్నీ, దిల్, అత్తారింటికి దారేది, డీజే టిల్లు వంటి చిత్రాల్లో ఆయన తన నటనతో మెప్పించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment