బాలీవుడ్ డైరెక్టర్, కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్ హోలీ పండుగ గురించి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ పండుగను తక్కువ స్థాయి వారు చేసుకునేదని ఆమె వ్యాఖ్యానించారు. దీంతో ఆమె వ్యాఖ్యలపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. హిందువులను కించపరిచేలా ఆమె మాట్లాడారని పలువురు అభిప్రాయపడ్డారు.
ఈ వ్యాఖ్యలపై ముంబైకి చెందిన ఒక వ్యక్తి పోలీసులను ఆశ్రయించగా, ఫరా ఖాన్‌పై కేసు నమోదైంది. మరోవైపు, సోషల్ మీడియాలో ఆమెపై తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఫరా వెంటనే క్షమాపణ చెప్పాలని, ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.