టాస్క్ ఫోర్స్ చేతికి చిక్కిన నకిలీ సర్టిఫికెట్స్ ముఠా

టాస్క్ ఫోర్స్ చేతికి చిక్కిన నకిలీ సర్టిఫికెట్స్ ముఠా

హైదరాబాద్‌లో నకిలీ సర్టిఫికెట్ల ముఠా గుట్టును టాస్క్ ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. డిగ్రీ, డిప్లమా ఫేక్ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ఆరుగురు గ్యాంగ్ సభ్యులను అరెస్ట్ చేశారు. వీరు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అన్నా యూనివర్సిటీ (చెన్నై) పేర్లతో నకిలీ సర్టిఫికెట్లు తయారు చేసి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఈ ముఠా విక్ర‌యించిన ఫేక్ సర్టిఫికెట్లను ఉపయోగించి కొంతమంది విదేశాలకు వెళ్లినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఫిల్మ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ముఠా కార్యకలాపాలు నిర్వహిస్తుండగా, వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.

సికింద్రాబాద్ నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ డీసీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో డీసీపీ సుధీంద్ర ఈ కేసు వివరాలను వెల్లడించారు. వజహత్ అలీ అనే వ్యక్తి నకిలీ సర్టిఫికెట్‌తో పట్టుబడ్డాడని, విచారణలో రాజిఉల్లా ఖాన్, హాబీబ్ అనే ఇద్దరు కూడా ఈ దందాలో పాలుపంచుకున్నట్లు తెలిసిందని చెప్పారు. ముఠా సభ్యులు పరేడ్ గ్రౌండ్ వద్ద సమావేశమవుతున్నట్లు సమాచారం అందడంతో, పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 114 నకిలీ సర్టిఫికెట్లు, 4 లాప్‌టాప్స్, ప్రింటర్, రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్, మొబైల్ ఫోన్లు, విసిటింగ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment