హైదరాబాద్‌లో నకిలీ కాల్ సెంటర్.. టార్గెట్ వారే

హైదరాబాద్‌లో నకిలీ కాల్ సెంటర్.. టార్గెట్ వారే

హైదరాబాద్‌లో నకిలీ కాల్ సెంటర్ వ్యవహారం కలకలం రేపుతోంది. గుజరాత్‌కు చెందిన మనస్విని అనే మహిళ హైటెక్ సిటీలో ‘ఎక్సిటో సొల్యూషన్స్’ పేరుతో న‌కిలీ కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. వాన్‌ప‌టేల్, ప్రతీక్, రాహుల్ అనే ముగ్గురు వ్య‌క్తులతో కలిసి ఈ కాల్ సెంటర్‌ను ఆమె నిర్వ‌హిస్తోంది. ఈ ముఠా అమెరికా పౌరులను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరాల‌కు పాల్ప‌డుతున్నారు.

60 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు
ప‌క్కా స‌మాచారంలో ఎక్సిటో సొల్యూష‌న్స్‌పై దాడి చేసిన సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు ఏకంగా మ‌న‌స్విని స‌హా 60 మందిని అరెస్టు చేశారు. ఈ నకిలీ కాల్ సెంటర్‌లో ఈశాన్య రాష్ట్రాలకు చెందిన వ్యక్తులను టెలీ కాలర్లుగా నియమించారని తెలిపారు. 63 లాప్ టాప్‌లు, ప‌దు సంఖ్య‌ల్లో సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్న‌ట్లుగా స‌మాచారం. ఈ కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వ‌చ్చే అవకాశమున్న‌ట్లుగా తెలుస్తోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment