పెనమలూరులో దారుణం.. బాలిక‌పై వృద్ధుడి అత్యాచారం

పెనమలూరులో దారుణం.. బాలిక‌పై వృద్ధుడి అత్యాచారం

కృష్ణా జిల్లా పెనమలూరు మండలంలో దారుణ సంఘ‌ట‌న‌ చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న పాఠ‌శాల‌లో రెండో తరగతి చదువుతున్న బాలికపై 60 ఏళ్ల వృద్ధుడు పబ్బుల నారాయణ లైంగిక దాడికి యత్నించాడు. ఈ దుశ్చర్య సమాజంలో తల్లిదండ్రులను కలవరపాటుకు గురిచేసింది.

బాలిక ధైర్యం – నిందితుడి అరెస్ట్
బాలిక తన కుక్కపిల్ల కోసం పక్కింట్లోకి వెళ్లింది. దీంతో నారాయణ బలవంతంగా ఆమెను ఇంట్లోకి లాక్కెళ్లాడు. భయంతో బాలిక కేకలు వేయ‌డం మొద‌లు పెట్టింది. నిందితుడి నుంచి త‌ప్పించుకొని ఇంట్లోకి ప‌రుగులు తీసింది. వెంటనే ఆ బాలిక తన తల్లిదండ్రులకు జరిగిన ఘోర ఘటనను వివరించింది. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, పోలీసులు స్పందించి నిందితుడిని అరెస్ట్ చేశారు. నారాయణపై పలు చట్టపరమైన చర్యలు తీసుకునే పనిలో ఉన్నారు.

ఇలాంటి ఘ‌ట‌న‌లు నిత్య‌కృత్యం అయ్యాయ‌ని, చిన్నారుల‌కు ర‌క్ష‌ణ లేకుండా పోయింద‌ని త‌ల్లిదండ్రులు వాపోతున్నారు. ప్ర‌భుత్వం స్పందించి నిందితుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, ఈ త‌ర‌హా ఘటన పునరావృతం కాకుండా ఉండటానికి చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని కోరుతున్నారు. అవగాహన కల్పించడం అత్యంత ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment