భారతీయ సినీ చరిత్రలో ముందెన్నడూ లేని విధంగా, అంతర్జాతీయ ప్రమాణాలతో రూపుదిద్దుకుంటున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. నేడు (ఏప్రిల్ 7, 2026) ఈ చిత్రానికి సంబంధించి ఒక సంచలన అప్డేట్ వెలువడింది. ఈ విజువల్ వండర్ సరిగ్గా ఏడాది తర్వాత, అంటే ఏప్రిల్ 7, 2027న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానుంది.
అడ్వెంచర్
‘వారణాసి’ చిత్రం కేవలం ఒక యాక్షన్ డ్రామా మాత్రమే కాదు, ఇది ఒక “గ్లోబ్‌ట్రాటింగ్ అడ్వెంచర్”. అడవిలో సాగే సాహసయాత్రకు, భారతీయ ఆధ్యాత్మికతను జోడిస్తూ రాజమౌళి ఈ కథను సిద్ధం చేశారు. ముఖ్యంగా వారణాసి నగరంలోని పురాతన రహస్యాలు, అంటార్కిటికాలోని మంచు కొండలు మరియు ఆఫ్రికా అడవుల నేపథ్యంలో సాగే ఈ ప్రయాణం ప్రేక్షకులను ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లనుంది. హాలీవుడ్ స్థాయి మేకింగ్ వాల్యూస్‌తో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది.








‘కమ్మని పాలనలో ఇబ్బందులు.. రాజీనామా చేస్తా’ – ఆదినారాయణరెడ్డి సంచలనం