కర్ణాటక రాష్ట్రంలో సంచలనం రేపిన మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) భూకుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కీలక నిర్ణయం తీసుకుంది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం, సీఎం సిద్ధరామయ్య సతీమణి పార్వతమ్మకు చెందిన రూ. 300 కోట్ల విలువ చేసే 142 ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది.
స్కామ్ వివరణ
ముడా అభివృద్ధి పనుల కోసం పార్వతమ్మకు చెందిన కొన్ని భూములను సేకరించడంతో, భర్త సీఎంగా ఉన్న సమయంలో ఆమెకు ఖరీదైన భూములు కేటాయించినట్లు ఆరోపణలు వెలువడ్డాయి. ఈ విషయంలో సామాజిక కార్యకర్తల ఫిర్యాదుతో లోకాయుక్త పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
గవర్నర్ ఆదేశాలతో విచారణ ప్రారంభం
ముడా భూకుంభకోణంపై గవర్నర్ ఆదేశాల మేరకు విచారణ చేపట్టిన లోకాయుక్త పోలీసులు, ఈ కేసులో మనీ లాండరింగ్ ఆరోపణల నేపథ్యంలో ఈడీ రంగంలోకి దిగింది. లోకాయుక్త పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసి ఆస్తులను అటాచ్ చేసింది.