లూలూ గ్రూప్ (Lulu Group) నకు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో భూముల కేటాయింపు (Lands Allocation) చట్టవిరుద్ధమని, దీనిపై సీబీఐ(CBI), ఈడీ(ED) లాంటి సంస్థలు తక్షణమే విచారణ ప్రారంభించాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతూ ప్రభుత్వ మాజీ కార్యదర్శి ఈ.ఏ.ఎస్. శర్మ (E.A.S. Sharma) బహిరంగ లేఖ (Open Letter) రాశారు. విశాఖపట్నం, విజయవాడలలో లులూ గ్రూపునకు అతి తక్కువ ధరకు విలువైన భూములను కేటాయించడం అనేది ప్రస్తుత నిబంధనలకు, సుప్రీంకోర్టు ఆదేశాలకు పూర్తిగా వ్యతిరేకమని ఆయన లేఖలో పేర్కొన్నారు.
ఈ.ఏ.ఎస్. శర్మ రాసిన లేఖలో మరో ముఖ్య అంశం ఏమిటంటే, లులూకు కేటాయించిన భూములు సీఆర్‌జెడ్ (కోస్తా నియంత్రణ జోన్) (CRZ – Coastal Regulation Zone) పరిధిలో ఉండటంతో ఆ భూముల్లో నిర్మాణాలు చేపట్టటం సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించడమేనని శర్మ స్పష్టం చేశారు. 2012లో జారీ చేసిన జీవో ప్రకారం ప్రైవేట్ సంస్థలకు చౌకగా ప్రభుత్వ భూములు కేటాయించరాదని, అలాంటి పరిస్థితుల్లో భూములు ఇవ్వాలంటే మార్కెట్ రేటు కంటే కనీసం 10 శాతం ఎక్కువ అద్దె వసూలు చేయాలన్నారు.
విదేశీ సంస్థ అయిన లులూ గ్రూపునకు విశాఖ సముద్రతీరంలో భూములు కేటాయించడమూ, ప్రజాస్వామ్య పరంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పునర్విచారణ చేసుకోవాలని సూచించారు. ఈ కేటాయింపుల్లో అనేక అనైతిక, చట్టవ్యతిరేక అంశాలు ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ శాఖలు వెంటనే జోక్యం చేసుకుని సీబీఐ, ఈడీ దర్యాప్తు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే లులూతో చేసిన ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని సూచించారు.
లులూ భూ కేటాయింపులపై సీబీఐ, ఈడీ దర్యాప్తు కోరిన ప్రభుత్వ మాజీ కార్యదర్శి
— Telugu Feed (@Telugufeedsite) July 28, 2025
భూ కేటాయింపులపై దర్యాప్తు చేయాలని ఈ అ స శర్మ లేఖ
అతి తక్కువ ధరకు భూములు కేటాయించడం చట్ట విరుద్ధం. సుప్రీం కోర్టు ఆదేశాలను ధిక్కరించి లులూకు భూములు కేటాయింపు
వెంటనే ఒప్పందం రద్దు చేసుకోవాలని డిమాండ్ pic.twitter.com/a3nh2vQNna