ఆధ్యాత్మిక నగరంగా పేరొందిన తిరుపతిలో నడిరోడ్డుపై మందుబాబుల అరాచకం సృష్టించారు. బైరాగిపట్టెడ కేశవాయనగుంట పరిధిలోని కేశవాయన కుంట వద్ద మద్యం మత్తులో కారును నడుపుతూ టీడీపీ కార్యకర్త యశ్వంత్ చౌదరి హల్చల్ చేశాడు. నడిరోడ్డుపై కారు ఆపి మందు పార్టీ చేసుకోవడంతో పాటు, ప్రశ్నించిన వారిపై కారు ఎక్కించి, కత్తి చూపిస్తూ అంతుచూస్తానని టీడీపీ కార్యకర్త బెదిరింపులకు దిగడం సంచలనంగా మారింది.
వివరాల్లోకి వెళితే.. కేశవాయన కుంట వద్ద నడిరోడ్డుపై కారు ఆపేసి మద్యం సేవిస్తూ టీడీపీ కార్యకర్త యశ్వంత్ చౌదరి హంగామా సృష్టించాడు. రహదారిపై వెళ్తున్న వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగించారు. ఈ క్రమంలో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్తున్న ఓ రోగి కుటుంబ సభ్యులు కారు పక్కకు తీయండి.. మేము ఇంటికి వెళ్తామని అడగడంతో వారితో దురుసుగా ప్రవర్తించాడు. కారును పక్కకు తీయాలని అడిగినందుకు ఆ రోగి కుటుంబ సభ్యులపైకి టీడీపీ కార్యకర్త తన కారును ఎక్కించాడు.
కారును అడ్డుకొని, ప్రశ్నించిన వారిపై దాడి చేయడమే కాకుండా, కత్తి చూపిస్తూ నడిరోడ్డుపై భయభ్రాంతులకు గురిచేశాడు. యశ్వంత్ చౌదరి వ్యవహారంతో ఆ ప్రాంతంలో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ మొత్తం ఘటనను స్థానికులు తమ సెల్ఫోన్లలో రికార్డు చేశారు. మద్యం మత్తులో కారు ఆపి హల్చల్ చేయడం, కత్తి చూపిస్తూ బెదిరింపులకు దిగడం వంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఆధ్యాత్మిక నగరంలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మద్యం మత్తులో ప్రజా రహదారిపై అరాచకం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు పోలీసులను డిమాండ్ చేస్తున్నారు. తిరుపతి వంటి పవిత్ర నగరంలో శాంతిభద్రతల పరిరక్షణపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
మద్యం మత్తులో కారుతో టీడీపీ కార్యకర్త హల్చల్
— Telugu Feed (@Telugufeedsite) February 1, 2026
తిరుపతి బైరాగిపట్టెడ కేశవయన కుంట వద్ద యశ్వంత్ చౌదరి వీరంగం
నడిరోడ్డుపై కారు నిలిపి మద్యం సేవించడంతో నిలిచిపోయిన ట్రాఫిక్
పేషెంట్ తరలిస్తున్న కారుకు దారి ఇవ్వాలని అడిగితే వారిపై దాడికి యత్నం
ప్రశ్నించినందుకు వారిపై దాడి… pic.twitter.com/jb3W8FQHTN








