---Advertisement---

DMK పాలనపై అన్నామలై సంచలన ఆరోపణలు

DMK పాలనపై బీజేపీ నేత అన్నామలై సంచలన ఆరోపణలు
---Advertisement---

త‌మిళనాడు బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు అన్నామలై డీఎంకే పాలనపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. డీఎంకే ప్రభుత్వ హయాంలో మ‌హిళ‌ల‌పై లైంగిక దాడుల‌కు పాల్ప‌డే నేరస్తులు, రౌడీషీటర్లు స్వేచ్ఛగా తిరుగుతున్నారని అన్నామలై అన్నారు. శుక్రవారం ఆయన సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ‘ఎక్స్’ ద్వారా ఈ అంశంపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ప్రజా సమస్యలపై గొంతు వినిపిస్తున్న బీజేపీ శ్రేణులపై డీఎంకే ప్రభుత్వం దాడులు చేస్తోందని ఆరోపించారు. తాజాగా మధురైలో అన్నా యూనివర్సిటీ లైంగిక దాడి ఘటనపై నిరసన తెలుపుతున్న బీజేపీ మహిళా మోర్చా నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేశారని తీవ్రంగా ఖండించారు. అంతేకాకుండా, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ప్రజాస్వామ్య విలువలను గౌరవించడం లేదని, భావ ప్రకటనా స్వేచ్ఛను హ‌రిస్తున్నార‌ని ఆరోపించారు. డీఎంకే పాలన ప్రజలపై నియంతృత్వ ధోరణిగా మారిందని అన్నామలై అభిప్రాయపడ్డారు.

గ‌త నెల చివ‌రి వారంలో త‌మిళ‌నాడు రాష్ట్రంలోని చెడు అంతమైపోవాలని కోరుతూ, కోయంబత్తూరులో అన్నామలై మురుగన్‌కు మొక్కులు చెల్లించుకునేందుకు ఆరు కొరడా దెబ్బలు స్వ‌యంగా త‌న‌కు తానే కొట్టుకున్నారు. డీఎంకే ప్ర‌భుత్వాన్ని గ‌ద్దె దింపే వ‌ర‌కు చెప్పులు వేసుకోన‌ని శ‌ప‌థం చేసిన విష‌యం తెలిసిందే.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment