ప్రపంచ మహిళల చెస్ ఛాంపియన్‌గా దివ్య దేశ్‌ముఖ్!

ప్రపంచ మహిళల చెస్ ఛాంపియన్‌గా దివ్య దేశ్‌ముఖ్!

ఫిడే (FIDE) ప్రపంచ మహిళల చెస్ (World Women’s chess) ఛాంపియన్‌గా 19 ఏళ్ల భార‌త చెస్ దిగ్గ‌జం దివ్య దేశ్ ముఖ్ చరిత్ర సృష్టించింది. ప్ర‌పంచ మ‌హిళల చెస్ (Indian Chess) ఛాంపియ‌న్‌షిప్‌ (Championship) ఫైనల్స్‌(Finals)లో తన ప్రత్యర్థి, భారత చెస్ దిగ్గజం కోనేరు హంపీ (Koneru Humpy)పై విజయం (Victory) సాధించి ఈ ప్రతిష్టాత్మక టైటిల్‌ (Title)ను కైవసం చేసుకుంది.

వీరిద్దరి మధ్య జరిగిన తుది సమరంలో, తొలి ర్యాపిడ్ టై-బ్రేకర్‌ గేమ్ డ్రాగా ముగిసింది. అయితే, నిర్ణయాత్మకమైన రెండో గేమ్‌లో దివ్య తన అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించి, మొత్తం 75 ఎత్తుల్లో విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ విజయంతో దివ్య దేశ్‌ముఖ్ ప్రపంచ చెస్ వేదికపై తనదైన ముద్ర వేసింది. హంపీపై విజ‌యం సాధించిన అనంత‌రం దివ్య దేశ్ ముఖ్ భావోద్వేగానికి గురైంది. అతి పిన్న వ‌య‌సులో ఛాంపియ‌న్‌గా నిలిచి చ‌రిత్రకెక్కింది. ఫైన‌ల్ పోరులో ఇద్ద‌రు భార‌తీయులు పాల్గొన‌గా.. తుది విజేత‌గా నాగ‌పూర్‌కు చెందిన దివ్య దేశ్ ముఖ్ నిలిచింది.

Join WhatsApp

Join Now

Leave a Comment