‘ధురంధర్ 2’ ట్రైలర్ సెన్సేషన్.. 45 దేశాల్లో ట్రెండింగ్

‘ధురంధర్ 2’ ట్రైలర్ సెన్సేషన్.. 45 దేశాల్లో నంబర్ 1 ట్రెండింగ్

భారతీయ సినిమా స్థాయిని ప్రపంచ వేదికపై మరోసారి చాటిచెబుతోంది ‘ధురంధర్ 2 (Dhurandhar 2)’. మార్చి 7న జియో స్టూడియోస్ విడుదల చేసిన ఈ చిత్ర ట్రైలర్ (Trailer) ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. విడుదలైన 48 గంటల్లోనే అన్ని డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో కలిపి 312 మిలియన్ల వ్యూస్ (312 Million Views) సాధించి రికార్డు క్రియేట్ చేసింది.

అంతేకాదు, ప్రపంచవ్యాప్తంగా 45కు పైగా దేశాల్లో యూట్యూబ్ ట్రెండింగ్‌లో (YouTube Trending) నంబర్ 1 స్థానాన్ని దక్కించుకుని గ్లోబల్ అటెన్షన్‌ను ఆకర్షించింది. ఈ సినిమాలో రణవీర్ సింగ్ (Ranveer Singh) జస్కిరత్ సింగ్ రంగీ (Jaskirat Singh Rangi), హమ్జా అలీ మజారి (Hamza Ali Mazari) అనే రెండు భిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించనున్నాడు. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలోని యాక్షన్ సన్నివేశాలు హాలీవుడ్ స్థాయిలో ఉన్నాయని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

ఈ చిత్రంలో భారీ తారాగణం కూడా ప్రేక్షకులను ఆకట్టుకోనుంది. ఆర్.మాధవన్ (R. Madhavan) అజయ్ సన్యాల్‌గా వ్యూహాత్మక మాస్టర్‌మైండ్ పాత్రలో కనిపించనుండగా, సంజయ్ దత్ (Sanjay Dutt) ఎస్‌పీ చౌధరి అస్లాంగా పవర్‌ఫుల్ రోల్‌లో మెరవనున్నారు. మరోవైపు అర్జున్ రాంపాల్ ఐఎస్ఐ మేజర్ ఇక్బాల్‌గా విలన్ పాత్రలో కనిపించనున్నారు.

‘ఉరి: ద సర్జికల్ స్ట్రైక్’ ఫేమ్ దర్శకుడు ఆదిత్య ధర్ ఈ హై-ఆక్టేన్ స్పై యాక్షన్ చిత్రానికి కథ, దర్శకత్వం వహించారు. B62 Studios బ్యానర్‌పై జ్యోతి దేశ్‌పాండే, లోకేష్ ధర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా విడుదల కానుండటం వల్ల ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment