‘ధురంధర్ 2’కి పాన్ ఇండియా హైప్..

‘ధురంధర్ 2’కి పాన్ ఇండియా హైప్..

బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ ‘ధురంధర్’ సంచలన విజయానికి కొనసాగింపుగా రాబోతున్న ‘ధురంధర్ 2’ పై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. మార్చి 19న పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతున్న ఈ సీక్వెల్‌పై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. ఫస్ట్ పార్ట్ సాధించిన సక్సెస్‌ను మించి ఉండేలా ఈసారి మేకర్స్ అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో, గ్రాండ్ విజువల్స్‌తో సినిమాను తెరకెక్కించినట్లు సమాచారం. ట్రైలర్, ప్రమోషనల్ కంటెంట్‌తోనే సోషల్ మీడియాలో ట్రెండ్ సృష్టిస్తున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులకు శ్రీకారం చుడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

అయితే మొదటి భాగం గల్ఫ్ దేశాల్లో సెన్సార్ సమస్యలతో నిషేధానికి గురై, నిర్మాతలకు భారీ నష్టం తెచ్చిన సంగతి తెలిసిందే. కానీ తరువాత నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైనప్పుడు గల్ఫ్ ప్రాంతం నుంచే అత్యధిక వ్యూస్ రావడం విశేషం. పాకిస్థాన్‌లో కూడా ఈ సినిమాకు ఊహించని స్థాయిలో ఆదరణ లభించింది. ఈ క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని, ఈసారి గల్ఫ్ దేశాల్లో ఎలాంటి అడ్డంకులు లేకుండా విడుదలయ్యేలా మేకర్స్ పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. వివాదాలకు తావులేకుండా కంటెంట్‌ను మలిచినట్లు సమాచారం. గల్ఫ్ రిలీజ్ సక్సెస్ అయితే, ‘ధురంధర్ 2’ వసూళ్లు సరికొత్త రికార్డులను నమోదు చేయడం ఖాయమని సినీ వర్గాలు చెబుతున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment