మిస్సైల్ మేన్, భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్‌కు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అనౌన్స్ అయ్యింది. కలామ్ జీవితాన్ని ఆధారంగా చేసుకొని ఓ భారీ సినిమా తెరకెక్కబోతోంది. ఈ సినిమాలో ప్రముఖ నటుడు ధనుష్ ప్రధాన పాత్రలో నటించనున్నారు. ఓమ్ రౌత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ‘కలామ్’ అనే పేరుతో తెరకెక్కిస్తున్నారు.
ఈ ప్రాజెక్టును ఫ్రాన్స్‌లో జరిగిన ఫిల్మ్ ఫెస్టివల్ సందర్భంగా అధికారికంగా ప్రకటించారు. భారతదేశాన్ని అంతరిక్ష, రక్షణ రంగాల్లో గగనతలాలకు చేర్చిన మిస్సైల్ మేన్, బ్రహ్మోస్ పితామహుడు, భారత రత్న అబ్దుల్ కలామ్ జీవితం ఎన్నో తరాలకు ప్రేరణగా నిలుస్తోంది. ఇప్పుడు అదే జీవితం వెండితెరపై ఆవిష్కృతం కానుంది.
సైన్స్, దేశభక్తి, కలల సాధన.. ఇలా అన్నింటినీ సమ్మిళితంగా చూపించేందుకు చిత్రబృందం విస్తృతంగా సిద్ధమవుతోంది. త్వరలో నటీనటుల పూర్తి వివరాలు, షూటింగ్ షెడ్యూల్ ప్రకటించనున్నారు.