---Advertisement---

ధనుష్ ‘కుబేర’ మూవీ నుంచి బిగ్‌ అప్డేట్..!

ధనుష్ ‘కుబేర' మూవీ నుంచి బిగ్‌ అప్డేట్..!
---Advertisement---

ధనుష్, నాగార్జున కలిసి నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘కుబేర’. రష్మిక మందన్నా ఇందులో ప్రధాన పాత్రలో మెరవనున్నారు. ఈ సినిమాపై అటు కోలీవుడ్‌, ఇటు టాలీవుడ్‌ ప్రేక్షకుల్లో భారీ అంచ‌నాలు నెలకొన్నాయి. ఇటీవల కొన్ని రోజులుగా ఈ సినిమా ఫిబ్రవరిలో విడుదల కాబోతోందని వార్తలు వచ్చాయి.

జూన్‌కి పోస్టుపోన్‌..
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, కుబేర సినిమా విడుదల తేదీని ఫిబ్ర‌వ‌రి నుంచి జూన్ నెలకు మార్చాలని మేకర్స్ భావిస్తున్నారని సమాచారం. అయితే ఈ విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన రావచ్చని ఫిల్మ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రానికి స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్ శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

క్రేజీ కాంబినేషన్‌తో వస్తున్న కుబేర సినిమా అభిమానుల అంచనాలను ఎక్కడికో తీసుకెళ్తోంది. ధనుష్, నాగార్జున, రష్మిక తారాగణంతో తెర‌కెక్కుతున్న ఈ ‘కుబేర’ గురించి మరిన్ని వివరాల కోసం వేచి చూడాల్సిందే!

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment