పంట కాలిపోతుంటే పొలంలో ధనుష్..

పంట కాలిపోతుంటే పొలంలో ధనుష్..

కోలీవుడ్ నటుడు ధనుష్ (Dhanush) వెండితెరపై మరో వినూత్న ప్రయోగానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ‘కుబేర’ (Kubera) సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న ఈ టాలెంటెడ్ స్టార్, తన 54వ చిత్రం కోసం పూర్తిస్థాయి గ్రామీణ నేపథ్య కథను ఎంచుకున్నారు. సెన్సిటివ్ చిత్రాలతో గుర్తింపు పొందిన విగ్నేష్ రాజా (Vignesh Raja) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

తాజాగా ధనుష్ 54వ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదలైంది. ఈ పోస్టర్‌లో కాలిపోతున్న పత్తి చేనులో ధనుష్ తలదించుకుని నిలబడి ఉన్న దృశ్యం ఆకట్టుకుంటోంది. ఫస్ట్‌లుక్‌ను బట్టి చూస్తే, ఈ సినిమా కథ గ్రామీణ నేపథ్యంలో సాగుతూ, రైతుల కష్టాలను ప్రధానంగా ప్రస్తావించనుందని అర్థమవుతోంది. ఇప్పటికే విభిన్న జానర్లలో నటించి మెప్పించిన ధనుష్, ఇప్పుడు పూర్తిస్థాయి ఎమోషనల్ కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. వేల్స్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ మరియు థింక్ స్టూడియోస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment