యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) నటించిన బ్లాక్‌బస్టర్ సినిమా ‘దేవర’ (Devara) విడుదలై ఏడాది పూర్తయిన సందర్భంగా, మేకర్స్ అభిమానులకు ఒక సర్ ప్రైజ్ తెలిపారు. ఈ చిత్రానికి సీక్వెల్‌ను అధికారికంగా ప్రకటించి, అందుకు సంబంధించిన ఒక పోస్టర్(Poster)ను విడుదల చేశారు.
‘దేవర’ రికార్డులు:’దేవర’ ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజే రూ. 172 కోట్ల గ్రాస్ వసూలు చేసి రికార్డు సృష్టించింది. మొత్తం రూ. 500 కోట్ల మార్క్‌ను చేరుకొని ఎన్టీఆర్ కెరీర్‌లోనే అతి పెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రం ఏకంగా ఆరు కేంద్రాలలో 100 రోజులు ప్రదర్శితమైంది. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాతోనే జాన్వీ కపూర్ తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఈ చిత్రంలో సైఫ్ అలీ ఖాన్, శ్రుతి మరాఠే, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషించారు.
‘వార్ 2’ సినిమాతో కొంత నిరాశపరిచినప్పటికీ, ఎన్టీఆర్ వరుసగా భారీ చిత్రాలతో ముందుకు రానున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జూన్ 25న విడుదల కానుంది. దీనికి ‘డ్రాగన్’ (Dragon) అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. త్రివిక్రమ్, అలాగే ‘జైలర్’ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్తో కూడా ఎన్టీఆర్ సినిమాలు చేసే అవకాశం ఉంది.







