దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లోని ఎర్రకోట (Red Fort) వద్ద సోమవారం సాయంత్రం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మెట్రో స్టేషన్ (Metro Station) సమీపంలో కారు పేలడంతో 10 మంది అక్కడికక్కడే మృతిచెందగా, 24 మందికి పైగా గాయపడ్డారు. అందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.సాక్షుల ప్రకారం, పేలుడు తీవ్రతకు 10కిపైగా వాహనాలు ధ్వంసమయ్యాయి. ఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఢిల్లీ పోలీసుల అదుపులో ఉన్న అనుమానితుడ్ని విచారిస్తున్నట్లు తెలిపారు.
ఎర్రకోట మెట్రో స్టేషన్ దగ్గర కారులో పేలుడు సంభవించినట్లుగా అధికారులు గుర్తించారు. గేట్ నెంబర్ -1 దగ్గర కారు బ్లాస్ట్ అవ్వగా, రెడ్ సిగ్నల్ వద్ద ఆగిన అన్ని వెహికిల్స్ పేలుడు ధాటికి 10 వాహనాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. ఈ పేలుడు అనంతరం దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించబడింది. పేలుడు కారణం ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. భద్రతా సంస్థలు దానిపై దర్యాప్తు ప్రారంభించాయి.
ఢిల్లీలో పేలుడుతో హైదరాబాద్ పోలీసుల అలెర్ట్ అయ్యారు. పాతబస్తీలో పోలీసుల విస్తృత తనిఖీలు చేపట్టారు. రద్దీ ప్రాంతాల్లో వాహనాల తనిఖీలు చేపడుతున్నారు.








