మెట్రోలో(Metro) ఓ యువతికి (young woman)సంబంధించిన ఫొటోలను (Photos) రహస్యంగా తీసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న CISF జవాన్‌పై (CISF Jawan) అధికారులు చర్యలు తీసుకున్నారు. ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సదరు జవాన్‌ను సస్పెండ్ (Suspended) చేసి, సమగ్ర విచారణకు ఆదేశించారు.
మెట్రోలో ప్రయాణిస్తున్న సమయంలో ఓ CISF జవాన్ తన ఫోన్‌తో రహస్యంగా ఫొటోలు (Secretly Photos) తీస్తున్నట్లు ఓ యువతి గుర్తించింది. దీంతో వెంటనే అతడిని నిలదీసి.. తన ఫొటోలను డిలీట్ చేయాలని కోరింది. అయితే మొదట్లో తాను ఎలాంటి ఫొటోలు తీయలేదని జవాన్ చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో యువతితో పాటు అక్కడున్న తోటి ప్రయాణికులు కూడా అతడిని ప్రశ్నించారు. ప్రయాణికులు గట్టిగా నిలదీయడంతో చివరకు తన ఫోన్ తీసి ఫొటోలను డిలీట్ చేసినట్లు సమాచారం.
తాను CISF జవాన్ అయి ఉండి ఇలా ఎలా ప్రవర్తిస్తావంటూ యువతి, ఇతర ప్రయాణికులు ప్రశ్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో జవాన్ ప్రయాణికులతో వాగ్వాదానికి దిగడంతో పాటు తోపులాట జరిగినట్లు సమాచారం.
అంతేకాకుండా జవాన్ తన వద్ద ఉన్న సర్వీస్ పిస్టల్‌తో (Service Pistol) బెదిరించినట్లు కూడా ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటన మొత్తాన్ని కొందరు ప్రయాణికులు వీడియో తీసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో వెలుగులోకి రావడంతో CISF అధికారులు ఘటనను తీవ్రంగా పరిగణించారు. సదరు జవాన్‌ను సస్పెండ్ చేసి, ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించారు.
విచారణలో వెల్లడయ్యే అంశాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని CISF అధికారులు తెలిపారు. మెట్రో వంటి బహిరంగ ప్రదేశంలో విధుల్లో ఉన్న భద్రతా సిబ్బంది ప్రవర్తనపై ఈ ఘటన చర్చకు దారితీసింది.








