ఢిల్లీ ఎన్నికలు: ‘ఆప్‌’కు అఖిలేష్‌ మద్దతు, షాక్‌లో కాంగ్రెస్‌

ఢిల్లీ ఎన్నికలు: ‘ఆప్‌’కు అఖిలేష్‌ మద్దతు, షాక్‌లో కాంగ్రెస్‌

ఢిల్లీలోని అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల కమిషన్‌ ప్రకటించిన కొద్ది సేపటికే ఓ కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. ఈ వార్త‌తో కాంగ్రెస్ ఒక్క‌సారిగా షాక్‌కు గురైంది. ఇండియా కూటమిలో భాగ‌మైన‌ సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేష్‌ యాదవ్ ఢిల్లీ ఎన్నిక‌ల్లో ఆమ్‌ఆద్మీ పార్టీ(ఆప్‌)కి త‌న మ‌ద్ద‌తును ఇస్తున్న‌ట్లుగా ప్రకటించారు.

ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ, ఆమ్‌ఆద్మీ పార్టీ వేరుగా పోటీ చేయాలని ముందుగానే నిర్ణయించుకున్నాయి. దీంతో అఖిలేష్ యాద‌వ్ కాంగ్రెస్‌కు బ‌దులు ఆమ్ ఆద్మీ పార్టీకి ప్రకటించడంతో రాజకీయ వాతావరణాన్ని మరింత ఉత్కంఠకు దారి తీసింది.

ఈ పరిణామంపై కేజ్రీవాల్‌ స్పందిస్తూ, అఖిలేష్ యాద‌వ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అఖిలేష్ ఎప్పుడూ ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతుగా నిలబడ్డారు అని కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. ఆయన ఢిల్లీ ఎన్నికల్లో ఆప్‌-బీజేపీ మధ్య ప్రధాన పోటీ జరుగుతుందని స్పష్టం చేశారు. ఢిల్లీ ఎన్నికలు ఫిబ్రవరి 5న జరగనున్నాయి. ఈ ఎన్నికలలో ప్రధాన పోటీ ఆప్‌ మరియు బీజేపీ మధ్య జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment