నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు.. బీజేపీ, ఆప్ ప్లేసులు తారుమారు

నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు.. బీజేపీ, ఆప్ ప్లేసులు తారుమారు

ఢిల్లీ అసెంబ్లీ (Delhi Assembly) సమావేశాలు నేటి (సోమ‌వారం) నుంచి ప్రారంభం కానున్నాయి. 27 ఏళ్ల తర్వాత తొలిసారిగా బీజేపీ (BJP) అధికార పక్షంగా, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ప్రతిపక్షంగా కూర్చోనున్నాయి. ఈ మార్పు సభలో వాడీవేడి చర్చలు, ఉద్రిక్తతలకు నాంది కానుందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

శాస‌న‌స‌భ‌లో షీష్ మహల్ కుంభకోణం, మద్యం పాలసీ వివాదం, యమునా నది శుద్ధి, CAG నివేదికలో అవినీతి ఆరోపణలు వంటి అంశాలపై బీజేపీ ఆప్‌ను నిలదీయనుంది. ప్రతిపక్షం ఏ ప్రశ్న వేసినా, సమగ్ర సమాధానం ఇచ్చేలా బీజేపీ సిద్ధమవుతోంది. ఇదిలా ఉండ‌గా మహిళల గౌరవ వేతనం, బీజేపీ అసంపూర్తి వాగ్దానాలు, కేంద్రం వైఫల్యాలు వంటి అంశాలతో బీజేపీని ఉక్కిరిబిక్కిర చేసేందుకు ఆప్ సిద్ధమైంది.

బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా, ముఖ్యమంత్రి రేఖ గుప్తా కలిసి తమ ఎమ్మెల్యేలతో వ్యూహాన్ని రూపొందించారు. CAG నివేదిక, ప్రతిపక్ష ఆరోపణలకు బలమైన సమాధానాలు..అన్నింటికీ పక్కా ప్లాన్ సిద్ధం చేశారు. వీరికి ప్ర‌తిగా, ఆప్ మాజీ సీఎం అతిషి ప్ర‌తిపక్ష నాయకురాలిగా తన దాడిని ప్రారంభించారు. బీజేపీ వాగ్దానాలపై విమ‌ర్శ‌లు స్టార్ట్ చేశారు.

నేటి నుంచి హీట్ పక్కా
ఈ సమావేశాల సందర్భంగా అధికార-ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు తప్పవు. ఢిల్లీ అభివృద్ధి, అవినీతి, వాగ్దానాల పరిపూరణపై సభలో తీవ్ర వాగ్వాదం జరగనుంది. రాజకీయ వేడెక్కుతున్న ఈ వేదికపై, ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి.

Join WhatsApp

Join Now

Leave a Comment