ఐపీఎల్ 2026 సీజన్‌లో నేడు క్రికెట్ అభిమానులకు డబుల్ ధమాకా వినోదం సిద్ధంగా ఉంది. మొదటి మ్యాచ్‌లో ఢీల్లీ క్యాపిటల్స్, ముంబాయు ఇండియన్స్ తో ఢిల్లీ వేదికగా ఢీకొననుంది. మధ్యాహ్నం 3:30 గంటలకు అరుణ్ జైట్లీ స్టేడియం లో ప్రారంభమయ్యే ఈ పోరు రెండు జట్లకూ కీలకంగా మారింది. సొంత మైదానం అనుకూలతతో ఢిల్లీ ఆత్మవిశ్వాసంగా బరిలోకి దిగుతుండగా, స్టార్ ఆటగాళ్లతో నిండిన ముంబై ఇండియన్స్ గట్టి పోటీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఈ సీజన్‌లో ఇరు జట్లు తమ తొలి మ్యాచ్‌లను గెలుచుకోవడంతో ఈ మ్యాచ్‌పై ఆసక్తి మరింత పెరిగింది.
ఇక రాత్రి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్, రాజస్ధాన్ రాయల్స్ తో అహ్మదాబాద్‌లో తలపడనుంది. ఈ మ్యాచ్ నరేంద్ర మోడీ స్టేడియం లో జరుగనుండగా, హోమ్ గ్రౌండ్‌లో గుజరాత్‌కు మంచి రికార్డు ఉంది. అయితే ప్రస్తుత ఫామ్‌లో ఉన్న రాజస్థాన్ రాయల్స్ ఈ మ్యాచ్‌ను ఉత్కంఠభరితంగా మార్చే అవకాశముంది. ముఖ్యంగా స్పిన్‌కు అనుకూలించే పిచ్‌పై రాజస్థాన్ స్పిన్నర్లు ఎలా రాణిస్తారో చూడాలి. ఒకవైపు భారీ విజయంతో జోష్‌లో ఉన్న రాజస్థాన్, మరోవైపు గత మ్యాచ్‌లో ఓటమి నుంచి తిరిగి రావాలనే లక్ష్యంతో ఉన్న గుజరాత్ — ఈ పోరును మరింత ఆసక్తికరంగా మారుస్తున్నాయి.








