రాజీనామా విషయంపై ఎమ్మెల్యే దానం నాగేందర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన రాజీనామా పూర్తిగా సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు. సీఎం ఆదేశిస్తే వెంటనే రాజీనామా చేసేందుకు సిద్ధమని వెల్లడించారు. మీడియాతో మాట్లాడుతూ ఆయన చెప్పారు:
“అనర్హత అంశం ప్రస్తుతం సుప్రీంకోర్టులో విచారణలో ఉంది. నేను ఇప్పటికే అప్పీల్ దాఖలు చేశాను. కేసు కోర్టులో పెండింగ్‌లో ఉంది. స్పీకర్ వద్ద కూడా అనర్హత పిటిషన్ పెండింగ్‌లోనే ఉంది. సుప్రీంకోర్టులో నా తరఫున వాదనలు వినిపిస్తాను. పరిస్థినిని బట్టి రాజీనామా పై నిర్ణయం తీసుకుంటాను,” అని ఆయన తెలిపారు.
అలాగే, “సీఎం రేవంత్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటాను. ఎన్నికలను ఎదుర్కోవడం నాకు కొత్త కాదు. నేను ఇప్పటివరకు 11 సార్లు ఎన్నికల్లో పోటీ చేశాను. రేవంత్ రెడ్డి మరో పదేళ్ల పాటు సీఎంగా కొనసాగితేనే రాష్ట్రం నిజమైన అభివృద్ధి దిశగా దూసుకెళ్తుంది,” అని దానం నాగేందర్ వ్యాఖ్యానించారు.








