దళిత సర్పంచ్‌కు టీడీపీ బెదిరింపులు.. సెల్ఫీ వీడియో వైర‌ల్‌

దళిత సర్పంచ్‌కు టీడీపీ బెదిరింపులు.. సెల్ఫీ వీడియో వైర‌ల్‌

త‌న విధుల‌కు ఆటంకం క‌లిగిస్తూ, త‌న‌ను గ్రామ స‌చివాల‌యం గేటు కూడా తాక‌నివ్వ‌కుండా బెదిరింపుల‌కు గురిచేస్తున్నార‌ని శ్రీ‌స‌త్య‌సాయి జిల్లా రాప్తాడు నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన ఓ ద‌ళిత స‌ర్పంచ్ విడుద‌ల చేసిన సెల్ఫీ వీడియో రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టిస్తోంది.

రాప్తాడు మండలంలోని మేడాపురం గ్రామంలో దళిత సర్పంచ్ రామాంజనేయులుకు స్థానిక టీడీపీ నేతల బెదిరింపులు ఎదురవుతున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామ సచివాలయంలోకి వెళ్లకుండా అడ్డుకోవడం, గ్రామ అభివృద్ధి పనులను చేయనివ్వకుండా అడ్డుపడడం, అధికార యంత్రాంగంపై ఒత్తిడి తీసుకురావడం వంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని సర్పంచ్ సెల్ఫీ వీడియోలో వెల్లడించారు.

సర్పంచ్ రామాంజనేయులు వివరాల ప్రకారం.. గ్రామంలో సాగాల్సిన అభివృద్ధి పనులను టీడీపీ నేతలు ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటున్నారని, తమ మాట వినాలని తెలుగుదేశం పార్టీ నేత‌లు ఒత్తిడి తీసుకువస్తున్నారన్నారు. ప్రజాప్రతినిధిగా గ్రామ ప్రజల కోసం పనిచేయడానికి ప్రయత్నించగా, బెదిరింపులు, ఒత్తిళ్లు తీవ్రమవుతున్నాయని తెలిపారు.

స్థానిక అధికారులను సంప్రదించినా, వారు కూడా “టీడీపీ నేతలు చెప్పినట్టు ఉండండి” అని సూచించడమే తామెదుర్కొన్న అతిపెద్ద నిరాశ అని సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి వ్యవహారం విచారకరమని అన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో సర్పంచ్ రామాంజనేయులు సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ ఘటనపై పోలీసుల చర్య ఏమిటన్న దానిపై స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment