క్రేజీ ట్విస్ట్‌ : దాదాసాహెబ్ ఫాల్కే బ‌యోపిక్‌.. జూ.ఎన్టీఆర్ vs ఆమీర్‌

క్రేజీ ట్విస్ట్‌ : దాదాసాహెబ్ ఫాల్కే బ‌యోపిక్‌.. జూ.ఎన్టీఆర్ vs ఆమీర్‌

టాలీవుడ్ (Tollywood) యంగ్ టైగ‌ర్ జూ.ఎన్టీఆర్ (Jr. NTR) కొత్త ప్రాజెక్ట్‌కు సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒక‌టి నెట్టింట వైరల్ అవుతోంది. జూ.ఎన్టీఆర్ తన సినీ కెరీర్‌లో మరో ప్రయోగాత్మక ప్రాజెక్ట్ కోసం సిద్దమవుతున్నట్లు టాలీవుడ్ కాంపౌండ్ నుంచి వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇది వ‌ర్క‌వుట్ అయితే తార‌క్ కెరీర్‌లోనే ఇదొక బిగ్గెస్ట్ సినిమాగా నిలిచిపోనుంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం టాలీవుడ్ నుంచి యంగ్ టైగ‌ర్‌, బాలీవుడ్ నుంచి సూప‌ర్ స్టార్ అమీర్ ఖాన్ (Aamir Khan) పోటీప‌డుతున్నారు.

ఇంత‌కీ విష‌యం ఏంటంటే.. భారతీయ సినిమా పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే (Dadasaheb Phalke) జీవితం ఆధారంగా ఒక‌టి కాదు రెండు బయోపిక్‌లు (Biopics) ప్రస్తుతం తెరకెక్కబోతున్నాయి. ఈ చిత్రాలు భారతీయ సినిమా చరిత్రలో మైలురాయిగా నిలిచిన ఫాల్కే జీవిత చ‌రిత్ర ఆధారంగా వెండితెరపై ఆవిష్కృతం చేసేందుకు ఇద్ద‌రు డైరెక్ట‌ర్లు పోటీప‌డుతున్నారు. వీరిద్ద‌రూ మ‌రో ఇద్ద‌రు హీరోల‌ను ఈ క‌థలో ఫాల్కే పాత్ర‌ కోసం ఎంపిక చేసుకున్న‌ట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఆమీర్ ఖాన్ – రాజ్‌కుమార్ హిరానీ కాంబోలో..
బాలీవుడ్ సూపర్‌స్టార్ ఆమీర్‌ ఖాన్ ఒక బయోపిక్‌లో దాదాసాహెబ్ ఫాల్కే పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు రాజ్‌కుమార్ హిరానీ (Rajkumar Hirani) దర్శకత్వం వహిస్తున్నారు. గత నాలుగేళ్లుగా డెవ‌ల‌ప్‌మెంట్‌లో ఉన్న ఈ ప్రాజెక్ట్ 2025 అక్టోబర్‌లో చిత్రీకరణ ప్రారంభించనుంది. ఈ సినిమా ఫాల్కే జీవితాన్ని భారత స్వాతంత్ర్య యుగం నేపథ్యంలో చిత్రీక‌రించనున్న‌ట్లు స‌మాచారం. ఆమీర్ ఖాన్ తన త‌దుప‌రి చిత్రం సితారే జమీన్ పర్ విడుదల అయిన తర్వాత ఈ బయోపిక్ కోసం సన్నాహాలు ప్రారంభిస్తారని సమాచారం. ఇప్ప‌టికే సితారే జ‌మీన్ ప‌ర్ సినిమా ట్రైల‌ర్ విడుద‌లై ప్రేక్ష‌కుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. ఈ సినిమా విడుద‌ల త‌రువాత హిరానీ దర్శకత్వంలో ఆమీర్ ఖాన్ నటన ఈ చిత్రాన్ని ఒక గొప్ప సినిమాటిక్ అనుభవంగా మలచనుందని అభిమానులు ఆశిస్తున్నారు.

జ‌క్క‌న్న మేడ్ ఇన్ ఇండియా
మరోవైపు, టాలీవుడ్ ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి (S.S. Rajamouli) స‌మ‌ర్ప‌ణ‌లో ఫాల్కే బయోపిక్ రూపొందుకోనుంది. మేడ్ ఇన్ ఇండియా అనే టైటిల్‌తో ఈ చిత్రానికి నితిన్ కక్కర్ (Nitin Kakkar) దర్శకత్వం వహిస్తున్నారు. 2023లో రాజమౌళి ఈ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్ర బృందం యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌ (Young Tiger Jr. NTR)ను ప్రధాన పాత్ర కోసం సంప్రదించింది. ఎన్టీఆర్ స్క్రిప్ట్ విని ఇష్టపడినట్లు తెలుస్తోంది, కానీ అధికారిక ఒప్పందం ఇంకా కుదరలేదని టాక్‌. ఈ చిత్రం ఫాల్కే 1913లో తీసిన భారతదేశపు మొదటి నీలం చిత్రం రాజా హరిశ్చంద్రతో (Raja Harishchandra) సహా అతని సినిమా యాత్రను వివరంగా చిత్రీకరించనుంది.

దాదాసాహెబ్ ఫాల్కే కృషి
దాదాసాహెబ్ ఫాల్కే భారతీయ సినిమాకు చేసిన కృషి అసమానమైనది. 1913లో రాజా హరిశ్చంద్ర చిత్రంతో భారతీయ సినిమా ప్రస్థానానికి ఆయన బీజం వేశారు. ఆర్థిక సవాళ్లు, సాంకేతిక పరిమితులు, సామాజిక అడ్డంకులను అధిగమించి, ఫాల్కే భారతదేశంలో సినిమాను ఒక కళారూపంగా స్థాపించారు. ఈ రెండు చిత్ర‌ బృందాలు – ఒకటి బాలీవుడ్ నుండి, మరొకటి టాలీవుడ్ నుండి – ఒకే వ్యక్తి జీవితంపై బయోపిక్‌లను తీసుకురావడం ఆసక్తికరమైన పరిణామం. ఈ రెండు చిత్రాలూ ముందుకు సాగుతాయా లేక ఒకటి ఆగిపోతుందా అనేది ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది.

ఈ రెండు బయోపిక్‌ల గురించి ప్రేక్షకులు ఉత్సాహంగా ఉన్నారు. ఆమీర్ ఖాన్, రాజ్‌కుమార్ హిరానీ లాంటి బాలీవుడ్ దిగ్గజాలు ఒక వైపు, ఎస్ఎస్ రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్ లాంటి హిట్ కాంబో మరో వైపు ఉండటంతో, ఈ చిత్రాలు భారీ అంచనాలను రేకెత్తిస్తున్నాయి. ఈ ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌లపై మరిన్ని అప్‌డేట్‌ల కోసం సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దాదాసాహెబ్ ఫాల్కే జీవితం భారతీయ సినిమా చరిత్రలో ఒక స్ఫూర్తిదాయకమైన అధ్యాయం.

Join WhatsApp

Join Now

Leave a Comment