---Advertisement---

క‌క్ష లేదంటూనే జ‌గ‌న్‌ను దెబ్బ‌కొట్టాల‌ని బాబు కుట్ర‌.. సీపీఐ రామ‌కృష్ణ కీల‌క వ్యాఖ్య‌లు

క‌క్ష లేదంటూనే జ‌గ‌న్‌ను దెబ్బ‌కొట్టాల‌ని బాబు కుట్ర‌.. సీపీఐ రామ‌కృష్ణ కీల‌క వ్యాఖ్య‌లు
---Advertisement---

విద్యుత్ ఒప్పందాలపై చంద్రబాబు ప్రకటన విడ్డూరంగా ఉందని సీపీఐ రాష్ట్ర కార్య‌ద‌ర్శి కె.రామ‌కృష్ణ అన్నారు. క్ష‌క్ష సాధింపులేదంటూనే చంద్రబాబు జగన్‌ను ప్రత్యర్ధిగా చూస్తున్నాడని, జగన్‌ను ఎలా దెబ్బకొట్టాలనే తప్ప చంద్రబాబు మరో ఆలోచన చేయడం లేదని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్రజా ప్రయోజనాలను పక్కన పెట్టి ఒక వ్యక్తిని టార్గెట్ చేయడం హేయ‌మైన చర్యగా అభివ‌ర్ణించారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఇలా దిగజారి మాట్లాడటం సరికాదన్నారు.

గోదావరి, కృష్ణా, పెన్నా నదుల అనుసంధానాన్ని ప్రైవేట్ పరం చేస్తాననడం సరైనది కాదని రామ‌కృష్ణ అభిప్రాయ‌ప‌డ్డారు. నీళ్లను అమ్మేసే కార్యక్రమాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టాలని చంద్రబాబు చూస్తున్నాడని ఆరోపించారు. మన రాష్ట్రానికి ఉన్న బలమైన సంపద గోదావరి అని, మన నీటిపై పెత్తనం ప్రైవేట్‌కు ఇవ్వ‌డం ఏంట‌ని ప్ర‌శ్నించారు. ఇది అత్యంత ప్రమాదకరమైన ఆలోచన అని చెప్పారు.

నేషనల్ హైవేలకు టోల్ గేట్ల మాదిరి నీళ్ల పైన అజమాయిషీ ఏంటి అని చంద్ర‌బాబును ప్ర‌శ్నించారు. చంద్రబాబు నిర్ణయాన్ని సీపీఐ తీవ్రంగా వ్యతిరేకిస్తుంద‌ని రామ‌కృష్ణ చెప్పారు. కేంద్రంతో మాట్లాడి పెద్ద పెద్ద ప్రాజెక్టులు తీసుకురావాల‌ని, అంతేకానీ నీటిని ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టడం సరికాదన్నారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో చంద్రబాబు చాలా తప్పు చేస్తున్నాడని, స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేట్ పరం కాకుండా చూడాలన్న చంద్ర‌బాబు, ఎన్నికల ముందు అవసరమైతే స్టీల్ ప్లాంట్ కోసం రాజీనామా చేస్తానని చెప్పాడ‌ని గుర్తుచేశారు. మర్చిపోతే చెప్పండి ఆ లెటర్ మా దగ్గర ఉంది పంపిస్తాం అంటూ చంద్ర‌బాబుకు చుర‌క‌లు అంటించారు. రాజకీయం కాదు, స్టీలే ప్లాంట్‌ను కాపాడుకోవాలనేదే త‌మ‌ ఆలోచన అని చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి కాకుండా మిట్టల్ కంపెనీ గురించి చంద్రబాబు మాట్లాడుతున్నాడని, నాలుగు నెలలుగా విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల జీతాలు నిలిపేశార‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను మూసేసి మిట్టల్ కంపెనీని తేవాలని కుట్ర‌లు చేస్తున్నాడ‌ని మండిప‌డ్డారు.

ప్రశ్నించే గొంతుక అన్న ప‌వ‌న్ క‌ల్యాణ్, ఆ గొంతు ఇప్పుడెందుకు మూగ‌బోయింద‌ని రామ‌కృష్ణ ప్ర‌శ్నించారు.
స్టీల్ ప్లాంట్ గురించి ఎందుకు మాట్లాడటం లేదని నిల‌దీశారు. బియ్యం తగ్గితే డబ్బులు కట్టేసినా కేసులు పెడుతున్నారని, పేర్ని నాని భార్య డబ్బులు కట్టినా పోలీస్ స్టేషన్‌కు పిలిపించార‌ని, మహిళ అని కూడా చూడకుండా స్టేషన్ కు తెచ్చి విచారణ చేస్తున్నారని పోలీసుల తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అదానీ పేరెత్తడానికి పవన్‌కు ఎందుకంత భయం అని ప్ర‌శ్నించారు. పదవిలో లేనప్పుడు ప్రశ్నించిన వపన్ .. డిప్యూటీ సీఎంగా ఉండి ఎందుకు మాట్లాడటం లేదన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్, అదానీ పై సీఎం, డిప్యూటీ సీఎం స్పందించాల‌ని, విశాఖ స్టీల్ ప్లాంట్ పై స్పష్టమైన ప్రకటన చేయాల‌ని, లేకపోతే జనవరి 8న ప్రధాని నరేంద్రమోదీ పర్యటనలో నల్లజెండాలతో నిరసన తెలియజేస్తా అని హెచ్చ‌రించారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment