రాష్ట్రపతి భవన్ (President Bhavan)లో 15వ ఉపరాష్ట్రపతి (Vice-President)గా సీపీ రాధాకృష్ణన్ (C.P Radhakrishnan) ప్రమాణ స్వీకారం (Oath Taking) చేశారు. రాష్ట్రపతి (President) ద్రౌపది ముర్ము (Droupadi Murmu) ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ (Modi), కేంద్ర మంత్రులు, బీజేపీ, బీజేపీ మిత్రపక్షాల ముఖ్యమంత్రులు, ఎన్డీఏ నేతలు హాజరయ్యారు. అలాగే మాజీ ఉపరాష్ట్రపతులు వెంకయ్య నాయుడు, జగదీప్ ధన్‌కర్ దంపతులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
సెప్టెంబర్ 9న జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్ విజయం సాధించారు. రాధాకృష్ణన్‌కు 452 ఓట్లు రాగా, ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి బి. సుదర్శన్ రెడ్డికి 300 ఓట్లు వచ్చాయి. దీంతో రాధాకృష్ణన్ 152 ఓట్ల మెజారిటీతో విజేతగా నిలిచారు.
రాజ్యసభ సెక్రటరీ జనరల్, రిటర్నింగ్ అధికారి పీసీ మోడీ ఫలితాలను ప్రకటిస్తూ, మొత్తం 781 మంది ఎంపీలలో 767 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపారు. పోలింగ్ శాతం 98.2గా నమోదైంది. మొత్తం 767 బ్యాలెట్లలో 752 చెల్లుబాటు కాగా, 15 చెల్లనివిగా తేలాయి. దీంతో మొదటి ప్రాధాన్యత ఓట్ల మెజారిటీ 377కి తగ్గింది. కాగితంపై ఎన్డీఏకు 427 మంది ఎంపీల మద్దతు ఉన్నప్పటికీ, వైఎస్సార్‌సీపీకి చెందిన 11 మంది శాసనసభ్యులు కూడా రాధాకృష్ణన్‌కు మద్దతు పలికారు. ఎన్డీఏ అభ్యర్థికి ఊహించిన దానికంటే 14 ఓట్లు అదనంగా వచ్చాయి. ఇది ప్రతిపక్షాల నుంచి క్రాస్ ఓటింగ్ జరిగిందని సూచిస్తుంది.
