ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ నేతల వ్యాఖ్యలు హద్దు మీరుతున్నాయి. ఢిల్లీ బీజేపీ సీనియర్ నేత రమేష్ బిదూరి తాజాగా కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ ప్రియాంకగాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరిలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బిదూరి బీజేపీ తరపున సీఎం అభ్యర్థిగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.
తాజాగా బిదూరి, ప్రియాంకగాంధీపై చేసిన వ్యాఖ్యలతో వివాదాస్పదమయ్యాయి. ఎమ్మెల్యేగా గెలిపిస్తే కళ్కాజీ నియోజకవర్గంలోని రోడ్లను “ప్రియాంక గాంధీ బుగ్గల్లా నున్నగా” తయారుచేస్తానని అన్నారు. ఈ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారడంతో మీడియా ఆయనను ప్రశ్నించింది. తన వ్యాఖ్యలు నిజమేనని బిదూరి అంగీకరించారు.
గతంలో లాలూ ప్రసాద్ యాదవ్ కూడా హేమమాలినిపై ఇలాంటి వ్యాఖ్యలు చేసిన విషయాన్ని బిదూరి గుర్తు చేశారు. “లాలూ ప్రసాద్‌లా మాట తప్పను అని, గెలిస్తే కళ్కాజీ రోడ్లను ప్రియాంక గాంధీ బుగ్గల్లా నున్నగా తయారు చేస్తానని తెలిపారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎలాంటి రియాక్షన్ ఇస్తుందో వేచిచూడాలి.