కాంగ్రెస్‌లో విషాదం.. రాంరెడ్డి దామోదర్ రెడ్డి కన్నుమూత

కాంగ్రెస్‌లో విషాదం.. రాంరెడ్డి దామోదర్ రెడ్డి కన్నుమూత

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి అలియాస్ దామ‌న్న‌ (73) అనారోగ్యంతో మృతి చెందారు. కొద్దిసేపటి క్రితం ఆయన హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో మృతిచెందారు.

దామోదర్ రెడ్డి ఐదు సార్లు ఎమ్మెల్యేగా ప్రజలకు సేవలందించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి కేబినెట్‌లో మంత్రిగానూ పనిచేశారు. తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాల నుంచి అనేక సార్లు ప్రజల ఆశీర్వాదం పొందారు. కాంగ్రెస్ పార్టీలో ఆయనకు ప్రత్యేక స్థానం ఉంది.

ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సూర్యాపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసి బీఆర్ఎస్ అభ్యర్థి జగదీశ్ రెడ్డిపై పోటీ చేసినా, ఓటమి పాలయ్యారు. అయినప్పటికీ, స్థానికంగా ప్రజలతో అనుబంధం కొనసాగిస్తూ, పార్టీ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొన్నారు. దామోద‌ర్‌రెడ్డి మృతితో కాంగ్రెస్ పార్టీలో విషాదం చోటుచేసుకుంది. ఎల్లుండి సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో దామోదర్ రెడ్డి అంత్యక్రియలు జరగనున్నాయి. ఆయన మరణం తెలంగాణ కాంగ్రెస్‌కు తీరని లోటుగా భావిస్తున్నారు. పార్టీ శ్రేణులు, అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

Join WhatsApp

Join Now

Leave a Comment